Indonesia Volcano Eruption: బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం, నదిలా ప్రవహిస్తున్న లావా

Indonesia Volcano Eruption: అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2021, 03:20 PM IST
Indonesia Volcano Eruption: బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం, నదిలా ప్రవహిస్తున్న లావా

Indonesia Volcano Eruption: అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 

భూకంపాలకు ఆలవాలమైన జావా ద్వీపంలో అతి ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం నిన్న అర్ఱరాత్రి దాటిన తరవాత ఒక్కసారిగా బద్దలై..అందులోంచి లావా అంతే నదిలా ప్రవహించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 90 మందికి గాయాలయ్యాయి. వేయిమందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

వాస్తవానికి నిన్న అంటే శనివారం ఉదయం నుంచే జావా ద్వీపంలో 3 వేల 6 వందల మీటర్ల ఎత్తైన ఈ అగ్ని పర్వతం నుంచి పెద్దఎత్తున బూడిద, వేడి రావడం ప్రారంభమైంది. 40 వేల అడుగుల ఎత్తువరకూ దట్టమైన పొగ, దమ్ము ధూళి అలముకుని వాతావరణం భయాందోళనలు రేపింది. తూర్పు జావా ప్రాంత ప్రజలైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. అగ్నిపర్వతం విస్పోటనం అనంతరం అక్కడున్న బ్రిడ్జి దెబ్బతినడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొంతమంది చిక్కుకున్నారు. సెమెరు విస్ఫోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండోనేషియాలో ఏకంగా 130కి పైగా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు.

Also read: Mob Lynching: పాక్‌లో శ్రీలంక జాతీయుడి దారుణ హత్య-నడిరోడ్డుపై కొట్టి చంపి,తగలబెట్టారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News