Stock Market Updates: స్టాక్ మార్కెట్లు సోమవారం (Stocks closing bell) భారీ నష్టాలతో ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 949 పాయింట్లు కోల్పోయి.. 56,747 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nifty) 265 పాయింట్ల నష్టంతో 16,931 వద్ద స్థిరపడింది.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడం సహా.. కేసులు భారీగా పెరుగున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలహీన పడింది. ఇప్పటి వరకు దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు బయటపడగా.. సగానికిపైగా నిన్న ఒక్క రోజే గుర్తించడం గమనార్హం.
దాదాపు అన్ని రంగాలు నష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాలపై ఈ తీవ్రత అధికంగా ఉంది.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 57,781 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,687 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,216 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,908 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈలో కీలక 30 షేర్లూ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.66 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 3.25 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.97 శాతం, టీసీఎస్ 2.88 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 2.88 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్ (దక్షిణ కొరియా) సూచీ లాభాలను గడిచింది.
షాంఘై (చైనా), టోక్యో (జపాన్), థైవాన్, హాంకాంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
కాస్త పెరిగిన రూపాయి..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 26 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.42 వద్ద కొనసాగుతోంది.
Also read: Digital payment: డిజిటల్ లావాదేవీల జోరు- 12 నెలల్లో 53 శాతం వృద్ధి!
Also read: Gold Rate: అత్యంత స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook