MLC elections: ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌..

MLC elections: రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో.. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. చదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు చెప్పారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 05:19 PM IST
  • ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​
  • ఆరు స్థానాల్లో ప్రశాంతంగా ఓటింగ్​ ప్రక్రియ
  • ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెల్లడి
MLC elections: ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌..

MLC elections: తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం ఐదు జిల్లాలో (ఉమ్మడి) నేడు ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.

ఓటు వేసేందుకు స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు. చదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఏఏ జిల్లాల్లో ఎన్నికలు..

మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. ఇందులో 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రెండు స్థానాలకు, నల్గొండ, మెదక్​ అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. 

ఎన్నికలు జరగుతున్న జిల్లాల్లో ఓటు వేసేందుకు 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్​. మొత్తం 5,326 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. అందులో ఎంత మంది ఓటు వేశారనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెల్లడికానున్నాయి.

ఓటింగ్ శాతం..

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మెదక్ జిల్లాలో ఓటింగ్ శాతం 96.69 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో ఖమ్మంలో 79.95 శాతం, అదిలాబాద్​లో 87.73 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది.

Also read:Husband kills wife : అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త, పెళ్లి అయిన ఆరు నెలలకే దారుణం

Also read: Hyderabad: వ్యభిచారం చేయాలని 16 ఏళ్ల కూతురిపై తల్లి ఒత్తిడి-కేసు నమోదు చేసిన పోలీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News