Venkatesh Iyer: అభిమానం అంటే ఇదేమరి.. రజనీకాంత్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్న వెంకటేష్! మాములుగా లేదుగా!

విజయ్‌ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌.. ఆ శతకంను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు అంకితం చేశాడు. చిన్నప్పటినుంచి రజనీకి వీరాభిమాని అయిన వెంకీ.. శతకం అనంతరం సూపర్ స్టార్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 03:50 PM IST
  • సూపర్ స్టార్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌
  • విజయ్‌ హజారే ట్రోఫీలో వెంకటేశ్‌ అయ్యర్‌ పరుగుల వరద
  • టీమిండియా వన్డే జట్టులోకి వెంకటేశ్‌ అయ్యర్‌
 Venkatesh Iyer: అభిమానం అంటే ఇదేమరి.. రజనీకాంత్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్న వెంకటేష్! మాములుగా లేదుగా!

Venkatesh Iyer mimicking superstar Rajnikanth's iconic style after hits century: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) పేరు ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 రెండో దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున మొదటి మ్యాచ్ ఆడడమే అతడికి కలిసొచ్చింది. ఐపీఎల్ (IPL) టోర్నీలో ఆడడమే కాకుండా.. ఆనతి కాలంలోనే ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీసుతో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన 26 ఏళ్ల వెంకటేష్.. ప్రస్తుతం జరుగుతున్న దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగుతున్న వెంకీ.. పరుగుల వరద పారిస్తున్నాడు. సునాయాసంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు. 

ఆదివారం ఉదయం చండీగఢ్ బౌలర్లను ఆటాడుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) భారీ సెంచరీ చేశాడు. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వెంకటేశ్‌.. 133 బంతుల్లో 151 పరుగులు చేశాడు. వెంకీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ సెంచరీని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌ (Rajnikanth)కు వెంకటేశ్‌ అంకితం చేశాడు. చిన్నప్పటినుంచి రజనీకి వీరాభిమాని అయిన వెంకీ.. శతకం అనంతరం సూపర్ స్టార్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. రజినీ ఎలాగైతే కళ్లద్దాలు పెట్టుకుంటారో, హాట్స్ ఆఫ్ చెబుతారో వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా అలానే చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 

Also Read: Video: అమెరికాలో టోర్నడోల బీభత్సం ఏ రేంజ్‌లో ఉందంటే-వీడియో వైరల్

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer) 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడి 155 పరుగులతో పాటు 5 వికెట్లు తీశాడు. భారత్-న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 36 పరుగులు, 1 వికెట్‌ పడగొట్టాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 348 పరుగులు చేసి 6 వికెట్లు తీసుకున్నాడు. వెంకీ ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేశాడు. 

Also Read: Samantha on Divorce Issue: మళ్లీ మళ్లీ అదే అంశమా...నాకిష్టం లేదు

విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer).. దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా వన్డే జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉంది. బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు వెంకీకి చోటివ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ద్వారా టీమిండియాలో అడుగుపెట్టిన వెంకటేశ్‌.. త్వరలో వన్డే జట్టులోకి రానున్నాడు. ఒకవేళ వెంకటేశ్‌ దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికై రాణిస్తే ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నట్లే. అప్పుడు హార్దిక్ పాండ్యాకు చోటు కష్టంగా మారనుంది. దక్షిణాఫ్రికా (IND vs SA) టూర్ డిసెంబర్‌ 26న నుంచి మొదలవనున్న నున్న నేపథ్యంలో త్వరలోనే వన్డే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News