Sunny Leone: లుంగీ డ్యాన్స్‌ ఇరగదీసిన సన్నీ లియోన్‌.. స్టెప్పులు మాములుగా లేవుగా (వీడియో)!!

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ 'ఓ మై ఘోస్ట్' సినిమా సెట్లోనే 'లుంగీ డ్యాన్స్' పాటకు డ్యాన్స్ చేసింది. లుంగీ ధరించి మాస్‌ బీట్‌కు అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించి వీడియో క్లిప్‌ని సన్నీ లియోన్‌ తాజాగా తన ఇన్‌స్టా​ ఖాతాలో షేర్‌  చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 06:29 PM IST
  • లుంగీ డ్యాన్స్‌ ఇరగదీసిన సన్నీ లియోన్‌
  • సన్నీ లియోన్‌ స్టెప్పులు మాములుగా లేవుగా
  • న్నీ లియోన్‌ లుంగీ డ్యాన్స్‌ చూశారా
Sunny Leone: లుంగీ డ్యాన్స్‌ ఇరగదీసిన సన్నీ లియోన్‌.. స్టెప్పులు మాములుగా లేవుగా (వీడియో)!!

 Sunny Leone's Lungi Dance video goes viral: బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ (Sunny Leone)కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హాట్‌ హాట్‌ అందాలతో కుర్రాళ్లతో పాటు పెద్ద వయసువారి మతులు కూడా పోగోడుతుంటుంది. ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సన్నీ ఒక్క ఫోటో షేర్‌ చేసిందంటే క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక ఆమె గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలకు క్షణాల్లో లక్షల లైకులు, కామెంట్లు వస్తాయి. తాజాగా సన్నీ లియోన్‌ షేర్‌ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. సన్నీ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. 

'ఓ మై ఘోస్ట్' (Oh My Ghost) సినిమాతో సన్నీ లియోన్‌ (Sunny Leone) తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సన్నీ కీలక పాత్రలో నటిస్తోన్న ఓ మై ఘోస్ట్ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్లోనే సన్నీ 'లుంగీ డ్యాన్స్' (Lungi Dance) పాటకు డ్యాన్స్ చేసింది. లుంగీ ధరించి మాస్‌ బీట్‌కు అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించి వీడియో క్లిప్‌ని సన్నీ లియోన్‌ తాజాగా తన ఇన్‌స్టా​ ఖాతాలో షేర్‌  చేశారు. 'చెన్నైలోని సెట్‌లో ఈ వీడియో చేశాం. నా లుంగి స్టెప్పులు మీకు నచ్చాయా' అని సన్నీ కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఫాన్స్ అందరూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: Harbhajan Singh: ఛాతిపై టాటూ వేసుకుని...రజనీకి బర్త్ డే విషెస్ చెప్పిన టీమిండియా క్రికెటర్

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ (Sunny Leone) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కీలక పాత్రలు చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. సన్నీ ప్రస్తుతం 'ఓ మై ఘోస్ట్' సినిమాతో పాటు..  వీరమాదేవి, రంగీలా, షెరో, కోకకోలా, హెలెన్‌ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. 40 ఏళ్ల సన్నీ తెలుగులో కరెంట్ తీగ, పీఎస్ గరుడావేగ, కుల్ఫీ లాంటి చిత్రాల్లో నటించారు. కెనడా నుంచి వచ్చిన సన్నీ.. బాలీవుడ్‌లో సెటిల్ అయ్యారు. 13 మే 1981 న జన్మించిన సన్నీ అసలు పేరు కరంజిత్ కౌర్ వోహ్రా. సన్నీ తన బాలీవుడ్ కెరీర్‌ను 2012లో 'జిస్మ్ 2' చిత్రంతో ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఒక చిత్రానికి రూ .4.5 కోట్లు వసూలు చేస్తున్నారట. 

Also Read: Jeff Bezos: టోర్నడో బీభత్సం..ఆరుగురు సిబ్బంది మృతి...గుండె పగిలిందన్న జెఫ్ బెజోస్

 
 
 
 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News