Bank Strike Today: నేటి నుంచి రెండు రోజులు బ్యాంకుల సమ్మె- కారణాలివే..

Bank Strike Today: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) పిలుపు మేరుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి. 

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 11:39 AM IST
  • నేటి నుంచి బ్యాంకుల సమ్మె
  • రెండు రోజుల పాటు నిరసనలు
  • పాల్గొననున్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు
Bank Strike Today: నేటి నుంచి రెండు రోజులు బ్యాంకుల సమ్మె- కారణాలివే..

Bank Strike Today: ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండు రోజుల సమ్మె చేపట్టనున్నాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు డిసెంబర్​ 16 (గురువారం), డిసెంబర్ 17 (శుక్రవారం) దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇందులో పాల్గొనున్నాయి.

సమ్మెకు కారణాలు?

ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్​ 2021-22లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ సంఘాలు సమ్మె (Banks Strike) చేపట్టనున్నాయి.

యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్​ బ్యాంక్ యూనియన్​ (యూఎఫ్​బీయూ) ఈ మేరకు సమ్మెకు (UFBU calld for Banks Strike) పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి ఈ నెల ఆరంభంలోనే నోటీసులు కూడా ఇచ్చాయి బ్యాంక్ యూనియన్లు. ప్రైవేటుకు.. బ్యాంకులను అప్పగించడం వల్ల బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్​​లో పడతాయని బ్యాంకింగ్ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

చర్చలు విఫలం..

సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అదనపు చీఫ్​ కమిషనర్​ తమతో చర్చలు జరిపినట్లు యూఎఫ్​బీయూ తెలిపింది. అయితే ఆ చర్చలు విఫలమైనందువల్లే సమ్మెకు సిద్ధమైనట్లు పేర్కొంది.

ఈ కార్యకలాపాలపై ప్రభావం..

సమ్మె కారణంగా నగదు బదిలీ, చెక్​ క్లియరెన్స్ సహా ఆఫ్​లైన్​ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.

Also read: Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్​

Also read: Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News