Viral video: మొబైల్ కోసం దారుణం.. మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దొంగలు

Snatchers viral video : తాజాగా కొందరు దుండగులు మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో దుండగులు వారి స్కూటీతో బాధితురాలిని దాదాపు 150 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 03:10 PM IST
  • ఢిల్లీలో దొంగల బీభత్సం
  • రోజురోజుకు పెరిగిపోతున్న దొంగల ఆగడాలు
  • స్కూటీతో బాధిరాలిని ఈడ్చుకెళ్లిన దొంగలు
 Viral video: మొబైల్ కోసం దారుణం.. మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దొంగలు

Mobile Snatchers Drags Woman up to 150 Metres on Road Viral Video: దేశ రాజధాని ఢిల్లీలో దొంగల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ పోలీసులకు (Delhi Police) బాధితులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో తాజాగా కొందరు దుండగులు మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో దుండగులు వారి స్కూటీతో (Scooty) బాధితురాలిని దాదాపు 150 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ (Viral) అవుతోంది.

బాధితురాలు షాలిమార్ బాగ్ (Shalimar Bagh) ప్రాంతంలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఆ మహిళ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. రోడ్డుపైన ఒంటిరిగా నడుచుకుంటూ వెళ్తోన్న ఆ మహిళను దుండగులు టార్గెట్ చేశారు. 

స్కూటీ మీద వచ్చిన ఇద్దరిలో వెనుక కూర్చొన్న అతను బాధితురాలి మొబైల్ (Mobile) లాక్కున్నాడు. అయితే ఆ మహిళ వెంటనే దుండగుడి చేయి గట్టిగా పట్టుకుంది. దీంతో దొరికిపోతామని భావించిన దుండగులు స్కూటీని వేగంగా ముందుకు తీసుకెళ్లారు. 

 

Also Read : 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు

బాధితురాలు అలాగే గట్టిగా పట్టుకుని వారి స్కూటీని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దుండగులు ఆమెను సుమారు 150 మీటర్ల (150 meters) వరకు స్కూటీతో ఈడ్చుకెళ్లారు. రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడి పడిపోయింది. అక్కడే రోడ్డు పక్కల ఉన్న స్థానికులు చూసి బాధితురాలిని పక్కకు తీసుకెళ్లారు. తర్వాత ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (police) కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : UberEats: ఆన్​లైన్​లో ఫుడ్​ ఆర్డర్​.. అంతరిక్షంలో డెలివరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News