Gas Blast In Pakistan: పాకిస్తాన్(Pakistan)లోని కరాచీ(karachi)లో భారీ పేలుడు జరిగింది. గ్యాస్ పైపలైన్ పేలడం(Gas Blast)తో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ ప్రైవేటు బ్యాంకు భవనం భారీగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ''గ్యాస్ పేలేందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటో తెలియరాలేదు. దీనిపై ఓ నిపుణుల బృందం దర్యాప్తు చేపట్టింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి" అని పోలీసు అధికార ప్రతినిధి సోహైల్ జోఖియో తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో 'రాయ్'’ తుపాను బీభత్సం.. 23 మంది మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook