Omicron Scare: అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 08:55 AM IST
  • ఒమిక్రాన్ భయాలతో కేంద్రం అప్రమత్తం
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు
  • నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఆరోగ్య శాఖ
Omicron Scare: అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!

Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్​ (Omicron cases in India) కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. గురువారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 300 దాటింది. కేసులు మరింత పెరిగే ప్రమాదముందని అంచనాలు వస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒమిక్రాన్​ తీవ్రత అధికంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వేరియట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించిన కేంద్రం.. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. రానున్నది పండుగల సీజన్​ కావడంతో కఠిన ఆంక్షలు విధించాలని కూడా కేంద్రం సూచించింది. ఒమిక్రాన్​ తీవ్రతను తట్టుకునేందుకు ఐదు దశల వ్యూహాన్ని అమలు చేయాలని తెలిపింది. ఒమిక్రాన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఈ మేరకు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు (Omicron guidelines in india) చేశారు.

కేంద్ర నూతన మార్గదర్శకాలు ఇవే..

  • కొవిడ్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ విజృంభన దృష్ట్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి సంసిద్ధంగా ఉండాలని తెలిపింది కేంద్రం. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం (Center new guidelines over Omicron fears) చేసింది.
  • ఒక జిల్లాలో గడిచిన వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10 శాతంగా నమోదైనా.. ఐసీయూల్లో 40 శాతం బెడ్లు నిండినా.. ఆయా జిల్లాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది.
  • ఒమిక్రాన్​కు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్న కారణంగా.. జిల్లా స్థాయి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చెపట్టాలి. అంబులెన్స్​లు, ఆక్సిజన్​ సిలిండర్ల కొరత లేకుండా చూడాలి ఆని సూచించింది కేంద్రం.
  • అన్ని క్లస్టర్లలో నమూనాలను ఆలస్యం చేయకుండా జీనోమ్​ సీక్వెన్సింగ్​ ల్యాబ్​కు పంపాలి.
  • డెల్టా వేరియంట్​తో పోలిస్తే.. ఒమిక్రాన్​కు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్న నేపథ్యంలో నియంత్రణపరమైన విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి.
  • ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం వీలైనంత త్వరగా కంటైన్మెంట్ జోన్​లు, బఫర్​ జోన్లను గుర్తించాలి. కంటైన్మెంట్ జోన్లపై పూర్తి నియంత్రణ తెచ్చుకోవాలి.
  • అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ (Night curfew in States) విధించాలి. పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో సమావేశాలపై ఆంక్షలు విధించాలి. అత్యక్రియల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితులు విధించడం, ఆఫీసులు, రవాణా, పరిశ్రమల్లో కూడా జన సమూహాలపై ఆంక్షలు విధించాలి.
  • ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలి
  • రాష్ట్రాలు 100 శాతం వ్యాక్సినేషన్​పై దృష్టి పెట్టాలి. జాతీయ సగటుకన్నా తక్కువ వ్యాక్సినేషన్ ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఆయా జిల్లాల్లో ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి.
  • కరోనా పరీక్షలపై నిఘా ఉంచాలి. ఇంటింటికి వెళ్లి కొవిడ్ కేసులను సర్వే నిర్వహించాలి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి.
  • పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ఎప్పటికప్పుడు సంప్రదించి పరిస్థితని సమీక్షించాలి. స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉన్న వారు.. నిబంధనలు కఠినంగా పాటించేలా చూడాలి.

Also read: Video: వామ్మో-విగ్గు, బ్లూటూత్ సెటప్-ఎస్సై పరీక్షలో అడ్డంగా దొరికిపోయిన అభ్యర్థి

Also read: Karnataka Earthquake: కర్ణాటకలో మరోసారి భూకంపం..రిక్టార్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News