Music director Kaithapram Viswanathan: చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి (58) (Kaithapram Viswanathan Namboothiri) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విశ్వనాథన్‌కు భార్య గౌరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
1963లో ఉత్తర కన్నూర్ జిల్లాలోని కైతప్రమ్ కుగ్రామంలో సంగీత కుటుంబంలో జన్మించారు విశ్వనాథన్. ఆయన మ్యూజిక్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించి కన్నకి, తిలక్కం సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాల నుండి 'గానభూషణం' బిరుదును పొందారు. 'కన్నకి' (Kannaki) చిత్రానికి గాను 2001లో కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డుతో (Kerala state film award) ఆయన్ని సత్కరించింది. కాగా విశ్వనాథన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, ప్రతిపక్షనేత వీడీ సతీశన్ విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథన్ అకాల మరణం చాలా బాధాకరమని విజయన్ (CM Pinarayi Vijayan) పేర్కొన్నారు.
Also Read: Manikka Vinayagam: ప్రముఖ తమిళ సింగర్ కన్నుమూత...సినీ ప్రముఖులు సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook