Pushpa Deleted Scene: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప' సినిమా డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు 'పుష్ప'రాజ్. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర విజయోత్సవ వేడుకలను చిత్రబృందం ఇటీవలే నిర్వహించింది.
ఈ నేపథ్యంలో సినిమాలోని డిలీటెడ్ సన్నివేశాలను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ కుటుంబం చేసిన అప్పును వసూలు చేసుకునేందుకు వడ్డీ వ్యాపారి వస్తాడు. తనకు రావాల్సిన డబ్బును వెంటనే ఇవ్వాలని ఊర్లో గొడవ చేస్తాడు. అయితే అప్పుడు మౌనంగా ఉన్న పుష్ప రాజ్.. ఇంట్లో బర్రెను అమ్మేసి అప్పు తీరుస్తాడు. అయితే తాను అప్పు చేసినట్లు ఊరంతా అరిచి చెప్పిన వడ్డీ వ్యాపారి.. తాను అప్పు తీర్చేసినట్లు కూడా ఊరంతా చెప్పాలని పట్టుబడతాడు. అదే విధంగా ఊరంతా తిరిగి తాను అప్పు తీర్చేసినట్లు వడ్డీ వ్యాపారితో చెప్పిస్తాడు.
మరోవైపు సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ పెద్దలు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన హిందీ చిత్రాల కంటే అల్లు అర్జున్ 'పుష్ప' అత్యధికంగా కలెక్షన్లు సాధించడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లోనూ తెలుగు సినిమా సత్తా మరోసారి చాటినట్లైంది.
తెలుగు సినిమాల కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యానించారు. అందుకు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమానే ఉదాహరణగా చూపించారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్లో ఆ స్టార్డమ్ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్ వివరించారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 17న విడుదల చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించింది. రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read: Khiladi Third Single: రవితేజ 'ఖిలాడీ' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్...
Also Read: Liger Glimpse : లైగర్ గ్లింప్స్ వచ్చేసింది.. రౌడీ చింపేశాడు.. ఛాయ్‌వాలా ఫైటర్‌గా దుమ్మురేపాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి