Doctors test covid positive: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజూకు పెరుగుతున్నాయి. తాజాగా బీహార్ పాట్నాలోని (Patna) నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్) 87 మంది వైద్యులు కరోనా (Covid-19) బారినపడడం కలకలం రేపింది. వారంతా ఆస్పత్రిలో క్యాంపస్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. అయితే ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే (Indian Medical Association function) ఈ వ్యాప్తికి కారణమైనట్లు భావిస్తున్నారు.
Bihar: "87 doctors of Nalanda Medical College and Hospital in Patna have tested positive for COVID-19. All of them are either asymptomatic or have mild symptoms and are in isolation on the hospital campus," Patna DM Chandrashekhar Singh said on Sunday
— ANI (@ANI) January 3, 2022
"ఎన్ఎంసీహెచ్లో 87 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్‌లో ఐసొలేషన్‌లో ఉన్నారు" అని పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. ఎన్ఎంసీహెచ్లో (Nalanda Medical College and Hospital) మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 75 మందికి ఆదివారం వైరస్ నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో పాట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే చర్యలు వేగవంతం చేసింది.
Also Read: Corona cases in India: ఒక్క రోజులో 33 వేల కరోనా కేసులు- థార్డ్ వేవ్‌కు సంకేతమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook