Ben Stokes: స్టోక్స్ కాక.. అదృష్టం అంటే నీదే పో! బంతి స్టంప్‌కు తాకినా బతికిపోయావుగా (వీడియో)!!

ఆఫ్ స్టంప్‌కు బంతి తగిలినా ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ బతికిబయటపడ్డాడు. ఈ ఘటన యాషెస్ సిరీస్ 2021-22లో చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 01:16 PM IST
  • బెన్ స్టోక్స్ లక్ మామూలుగా లేదుగా
  • స్టోక్స్ కాక.. అదృష్టం అంటే నీదే
  • బాల్ తగిలినా బతికిబయటపడ్డ స్టోక్స్
Ben Stokes: స్టోక్స్ కాక.. అదృష్టం అంటే నీదే పో! బంతి స్టంప్‌కు తాకినా బతికిపోయావుగా (వీడియో)!!

Ben Stokes remains not-out after getting bowled: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని, ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు నాటౌట్ అయినా.. అంపైర్ తప్పిదం కారణంగా పెవిలియన్ చేరుతుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఔట్ అయినా.. అదే అంపైర్ కారణంగా బ్యాటర్ బతికిపోతుంటాడు. ఇక బంతి స్టంప్‌కు తాకినా నాటౌట్‌గా నిలిచిన సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. అదృష్టం జేబులో పెట్టుకుని వచ్చిన ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ (Ben Stokes).. ఆఫ్ స్టంప్‌కు బంతి తగిలినా బతికిబయటపడ్డాడు. ఈ ఘటన యాషెస్ సిరీస్ (Ashes) 2021-22లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలిస్తే... 

యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా 416/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. స్టార్ బ్యాటర్లు జో రూట్ (0), డేవిడ్ మలన్ (3) త్వరగా ఔట్ అవ్వడంతో బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. జానీ బెయిర్‌స్టో అండతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే  ఆసీస్ బౌలర్ కామెరూన్ గ్రీన్ వేసిన ఓ బంతిని స్టోక్స్‌ వదిలేశాడు. అది కాస్తా వికెట్లను తాక్కుంటూ వెళ్లిపోయింది. వెంటనే ఆస్ట్రేలియా టీమ్ అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు. 

Also Read: Viral Video: మా నాన్న ఎంపీటీసీ.. నన్నే ఆపుతవా..? పోలీసులకు 8వ తరగతి స్టూడెంట్ వార్నింగ్

అయితే తన కాలికి బంతి తగలలేదని తెలిసిన బెన్ స్టోక్స్‌ వెంటనే 'డీఆర్‌ఎస్' (DERS) రివ్యూ కోరాడు. రిప్లైలో స్టోక్స్‌ వదిలేసిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకినట్టు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అయితే 130 కిలో మీటర్లకి పైగా వేగంతో వచ్చిన బంతి వికెట్లను తాకినా.. స్టంప్‌ (Stumps)పై ఉన్న బెయిల్ (Bail) మాత్రం కిందపడలేదు. దాంతో ఆస్ట్రేలియా ప్లేయర్స్ నిరాశకు గురికాగా.. స్టోక్స్‌ మాత్రం పెద్దగా నవ్వేశాడు. ఈ ఘటన నమ్మని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్టంప్స్ దగ్గరికి వెళ్లి చేతులతో బెయిల్‌ను కదిపి చూడడం నవ్వులు పూయించింది. ఆపై స్టోక్స్ తన బ్యాటింగ్ కొనసాగించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది. 'స్టోక్స్ కాక.. అదృష్టం అంటే నీదే పో' అంటూ క్రికెట్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

ఈ ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) స్పందించారు. కొత్త రూల్ తేవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. 'లెగ్ బిఫోర్ వికెట్‌లాగా.. 'హిట్టింగ్ ద స్టంప్స్' అనే ఓ కొత్త రూల్ తేవాలనుకుంటా. ఇలా స్టంప్స్‌కి బాల్ తగిలినా కూడా వికెట్ పడకపోతే ఎలా?. మీరేం అంటారు.. బౌలర్లకు న్యాయం జరగాలి కదా?' అని ఆసీస్ మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను సచిన్ ట్యాగ్ చేశారు. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) కూడా ఓ ట్వీట్ చేశాడు. 'ఆఫ్ స్టంప్‌ మీద పూర్తి భరోసాతో బ్యాట్స్‌మెన్ బంతిని వదిలేశాడు. బ్యాటర్ బాల్‌ని కొట్టి ఉంటాడులే అని స్టంప్ కూడా పడడం మానేసింది' అంటూ డీకే కామెంట్ చేశాడు. 

Also Read: లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు 'నెగటివ్' కావాలని కోరుకుంటున్నా.. సతీమణిపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News