Vanama Raghava: వనమా రాఘవ అరాచకాల చిట్టా.. ఇప్పటివరకూ ఎన్ని నేరాలకు పాల్పడ్డాడంటే

Vanama Raghava Crime History: పాల్వంచకి చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర నేర చరిత్ర హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని రాఘవ ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 02:46 PM IST
  • వనమా రాఘవ అరాచకాల చిట్టా
  • గతంలోనూ ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు
  • భూకబ్జాలు, బెదిరింపులు, హత్య కేసుల్లో రాఘవపై కేసులు
Vanama Raghava: వనమా రాఘవ అరాచకాల చిట్టా.. ఇప్పటివరకూ ఎన్ని నేరాలకు పాల్పడ్డాడంటే

Vanama Raghava Crime History: పాల్వంచకి చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర నేర చరిత్ర హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు వనమా రాఘవ. ఒకరకంగా షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని పోలీసులు, అధికారులపై రాఘవ అజమాయిషీ చలాయిస్తున్నాడు. ఉద్యోగులు, పోలీసుల పోస్టింగ్‌లు, బదిలీలు అన్నీ రాఘవ కనుసన్నుల్లోనే జరుగుతాయి. నియోజకవర్గంలో ఎంతోమంది రాఘవ దురాగతాలకు బలయ్యారనే ఆరోపణలున్నాయి.

వనమా రాఘవపై 2006లో అధికారికంగా మొదటి కేసు నమోదైంది. కానీ అంతకు దశాబ్ధం ముందు నుంచే రాఘవ ఆగడాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 2006లో పాలకోయ తండాలో భూకబ్జా కేసులో రాఘవపై కేసు నమోదైంది. 

2013లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాఘవపై రెండు కేసులు నమోదయ్యాయి. మద్యం, డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 2017లో ఓ ధర్నాలో పాల్గొన్న సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మరో కేసు నమోదైంది.

2020లో పాల్వంచ పట్టణానికి చెందిన ఓ గిరిజన మహిళపై వనమా రాఘవ అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారు. జ్యోతికి చెందిన భూ వివాదంలో రాఘవ జోక్యం చేసుకుని ఆమెను ఇబ్బందులకు గురిచేశాడనే ఆరోపణలున్నాయి. దీనిపై బాధితురాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

వడ్డీ వ్యాపారి హత్య కేసులో ఆరోపణలు

గతేడాది పాల్వంచ పట్టణానికి చెందిన వడ్డీ వ్యాపారి మల్లిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులోనూ వనమా రాఘవపై ఆరోపణలు వచ్చాయి. వెంకటేశ్వర్లు రూ.50 లక్షలు చీటీ పాడగా... చీటీ నిర్వాహకుడు నగదుకు బదులు ప్లాట్ రాసిచ్చాడు. అయితే అదే ప్లాట్‌ను మరో వ్యక్తికి కూడా రాసిచ్చినట్లు తెలియడంతో వెంకటేశ్వర్లు చీటీ నిర్వాహకుడిని ప్రశ్నించాడు. ఈ వ్యవహారంలో రాఘవ జోక్యం చేసుకుని వెంకటేశ్వర్లును బెదిరించాడనే ఆరోపణలున్నాయి. కొద్దిరోజులకు వెంకటేశ్వర్లు పైనే పోలీసులు కేసు నమోదు చేయగా... అతను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో తన చావుకు వనమా రాఘవే కారణమని పేర్కొన్నాడు.

పాల్వంచ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆరోపణలు :

తన తల్లి, సోదరితో ఆస్తి వివాదానికి తోడు వనమా రాఘవ (Vanama Raghava) వేధింపుల కారణంగా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు వనమా రాఘవను ఆశ్రయించగా... ఏ భర్త వినకూడని మాట అతను చెవిన వేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యను అతని వద్దకు పంపిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని... అంతవరకూ ఆ సమస్య అలాగే ఉంటుందని బెదిరించినట్లు చెప్పాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులకు తోడు రాఘవ వేధింపులతో కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.

Also Read: Thaman Corona Positive: టాలీవుడ్ లో కరోనా కలవరం.. తమన్ కు కొవిడ్ పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News