Corona in Telangana: తెలంగాణలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 2,295 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శుక్రవారం (Corona new cases in Telangana) వెల్లడించింది.
మొత్తం 64,474 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6,89,751కు (Total Corona cases in Telangana) చేరింది.
మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. నేడు ఒక్క రోజే జీహెచ్ఎంసీ పరిధిలో 1,452 కొవిడ్ కేసులు (Corona cases in Hyderabad) నమోదయ్యాయి.
కొవిడ్ కారణంగా తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య (Corona deaths in Telangana) 4,039కు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
ఇక గడిచిన 24 గంటల్లో 278 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,75,851 మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.98 శాతంగా ఉంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.07.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/PSQfH5fmJ8— IPRDepartment (@IPRTelangana) January 7, 2022
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 9,861 యాక్టివ్ కొవిడ్ కేసులు (Corona Active cases in Telangana) ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,00,02,149 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. పది లక్షల మందికి గానూ.. 8,04,343 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 10,336 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని వివరించింది.
Also read: Jagga Reddy News: 'ఆ పార్టీలకు లేని కొవిడ్ రూల్స్ కాంగ్రెస్‌కు మాత్రమేనా?'
Also read: Breaking News: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్- సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook