Nigeria Attacks: నైజీరియాలో బందిపోట్లు (bandits) రెచ్చిపోయారు. వాయువ్య నైజీరియా రాష్ట్రమైన జంఫారాలోని (Zamfara) పలు గ్రామాలలో మంగళవారం నుంచి గురువారం మధ్య ప్రజలపై పలుమార్ల దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. గత సోమవారం తెల్లవారుజామున జంఫారా రాష్ట్రంలోని గుసామి అటవీ ప్రాంతం, పశ్చిమ త్సామ్రే గ్రామంలోని సాయుధులపై అక్కడి సైన్యం వైమానికదాడులు చేసింది. ఈ ఘటనలో 100 మందికిపైగా బందిపోట్లు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా బందిపోట్లు ఈ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.
మోటార్‌సైకిళ్లపై 300 మందికిపైగా వచ్చిన బందిపోట్లు (bandits) ఇళ్లను దహనం చేయడంతోపాటు మనుషుల్ని ఊచకోత కోశారు. ఈ క్రమంలో 2,000 పశువులను దొంగిలించారు. ఇక్కడి క్రిమినల్ గ్యాంగ్‌లతో ప్రభుత్వ దళాలకు తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వీరిని బందిపోట్లుగా పేర్కొంది. ప్రభుత్వ దళాల దాడులను తప్పించుకొనేందుకు ఈ బందిపోట్లు జంఫారా రాష్ట్రం వైపు వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Also Read: Brazil: టూరిస్ట్ బోట్లపై విరిగిపడిన కొండ చరియలు...ఏడుగురు మృతి, 20 మంది గల్లంతు..
ఈ దాడి ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ (President Muhammadu Buhari ) స్పందించారు. '‘సాయుధులపై పోరాటంలో ప్రభుత్వ దళాలు వెనక్కి తగ్గేది లేదు. తాజా దాడి బందిపోట్ల నిస్పృహను తెలియజేస్తోంది'' అని బుహారీ పేర్కొన్నారు. ఈ బందిపోట్లను కూడా ఉగ్రవాదులగా ప్రకటిస్తూ కఠిన వైఖరి అనుసరిస్తామని అక్కడి ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి