APSRTC Jobs: నిరుద్యోగులను అప్రమత్తం చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మోసం చేసున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని (Beware of fraudsters) సూచించింది.
ఉద్యోగాల విషయంలో ఆర్టీసీ అధికారికంగా ప్రకటన చేస్తే తప్పా.. బయటి వ్యక్తులు ఎవరు చెప్పినా ఉద్యోగాల గురించి వచ్చే వార్తలు నమ్మోద్దని స్పష్టం చేసింది. నిరుద్యోగులే లక్ష్యంగా కొందరు కేటుగాళ్లు చేస్తున్న మోసాలు ఇటీవల గుర్తించి ఈ హెచ్చరిక చేసింది ఏపీ ఆర్టీసీ.
అసలు ఏమైందంటే..
ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. ఇటీవల ఓ వ్యక్తి కొందరు నిరుద్యోగులకు ఆశ చూపాడు. ఆర్టీసీ మదనపల్లి, విజయవాడ పేర్లతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి.. వాటిని నిజమైన వాటిగా నమ్మించాడు. ఆతడి మాయలో చిక్కుకున్న యువకుల నుంచి ఉద్యోగం కోసం డబ్బులు సేకరించాడు. మదనపల్లి, విజయవాడ రీజియన్లలోని బస్ డిపోల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆ వ్యక్తి మోసానికి పాల్పడినట్లు (Fraud on the unemployed in the name of APSRTC) అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే ఆర్టీసీలో ఉద్యోగాలపై పత్రికల్లో ప్రకటన (APSRTC Jobs Notification) ఇస్తామని.. అప్పుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది ఏపీఎస్ఆర్టీసీ. అలా కాకుండా సులభంగా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మోద్దని సూచించింది. అలాంటి వారు ఎవరైనా సంప్రదిస్తే.. వారి గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని (Beware of scams in the name of jobs) కోరింది.
సంక్రాంతి స్పెషల్ బస్సులు...
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ.. తెలుగు రాష్ట్రాల మధ్య భారీగా స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. ఏపీలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా స్పెషల్ బస్సులు (APSRTC Special Buses For Sankranthi) నడుస్తున్నాయి. ఇదే సమయంలో బస్సుల్లో టికెట్ ధరలను 50 శాతం (Ticket prices increase during festival season) పెంచింది.
ఇక ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్ సంస్థల కూడా ఛార్జీలను భారీగా పెంచాయి. పండుగ సాకు పేరుతో ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.
దీనితో ఏపీ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా? బస్సుల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను తనికీ చేసి తెలుసుకుంటోంది. ఏ రూల్స్ పాటించకపోయినా భారీగా (Fines on private travel buses) జరిమానాలు విధిస్తోంది.
Also read: TDP Leader Murder Case: గుంటూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య.. అధికార పార్టీ నేతలే కారణమా?
Also read: Anandayya corona medicine: ఆనందయ్యకు షాకిచ్చిన ఆయుష్ శాఖ.. నోటీసులు జారీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook