TDP Leader Murder Case: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజకీయ హత్య కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెదేపా నేత హత్య కలకలం సృష్టించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు.
గురువారం తెల్లవారుజామున గ్రామ కూడలిలో కూర్చుని ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు.. ఆయన్ని కర్రలు, రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడ్నుంచి దుండగులు పారిపోయారు.
పాత కక్షల నేపథ్యంలో..
గుండ్లపాడు గ్రామంలో పాత కక్షలే హత్యకు దారి తాసినట్లు తెలుస్తోంది. మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి చంద్రయ్య ముఖ్య అనుచరుడు. ఇటీవల బ్రహ్మారెడ్డి వెంట తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ కారణంగానే చంద్రయ్యను హత్య చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుండ్లపాడు గ్రామ టీడీపీ నేత చంద్రయ్య హత్యపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్ సీఎంగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై దాడులు.. పోరాడే వాళ్లను హత్య చేయడం వాళ్లకు అలవాటై పోయిందని ఆయన ఆరోపించారు.
చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ చెప్పారు. హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.
Also Read: Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
Also Read: AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ... 3వేలకుపైగా కేసులు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook