Bhanuka Rajapaksa Withdraw His Retirement: చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స.. ఇప్పుడు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అంశంపై లంక బోర్డు పెద్దలతో గురువారం మాట్లాడినట్లు పేర్కొంది.
"క్రీడా మంత్రి, జాతీయ జట్టు సెలక్టర్లతో సమావేశం అనంతరం.. ఈ ఏడాది జనవరి 3న చేసిన రిటైర్మెంట్ ప్రకటనను విరమించుకుంటున్నట్లు రాజపక్స పేర్కొన్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు స్పష్టత ఇచ్చాడు" అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.
లంక బోర్డుకు సమర్పించిన లేఖలో.. తాను ఎంతగానో ప్రేమించే శ్రీలంక జట్టు తరఫున మరికొన్ని రోజులు ఆడాలని ఆశిస్తున్నట్లు రాజపక్స తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక టీమ్ తరఫున 5 వన్డేలు, 18 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు పెట్టిన కొన్ని నిబంధనల కారణంగానే భానుక రాజపక్స రిటైర్మెంట్ ప్రకటించాడని ఇటీవలే కొన్ని వార్తలు వచ్చాయి.
శ్రీలంక క్రికెట్ ప్రవేశపెట్టిన నిబంధనలేమిటి?
శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల కోసం ఇటీవలే కొత్త ఫిట్నెస్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు 8.10 నిమిషాలలో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి.
ఒకవేళ 8.35 నిమిషాల నుంచి 8.55 నిమిషాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తితే ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఎంతమేర కోత విధిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
దీంతోపాటు ప్రతి నెలా స్కిన్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది బాడీ ఫ్యాట్ ను కొలిచే ఓ పరీక్ష. ఒక పరికరం ద్వారా శరీరంలోని కొవ్వును కొలుస్తారు. స్కిన్ ఫోల్డ్ టెస్టులో 70-85 కంటే తక్కువ ఉన్నవారినే తుది జట్టులో ఉంచుతారు.
అయితే ఈ కొత్త నిబంధనలపై భానుక రాజపక్సా అసంతృప్తి వ్యక్తం చేశాడని సమచారం. స్కిన్ ఫోల్డ్ టెస్టు ద్వారా తన సహజ ఆట మీద ప్రభావం పడుతుందని అతడు ఆందోళన చెందినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. తాను ప్రత్యేకంగా ఆడే పవర్ హిట్టింగ్ మీద కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని రాజపక్సా వాపోయినట్లు తెలుస్తోంది.
Also Read: Virat Kohli Test Catches: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. వంద క్యాచులు అందుకున్న ఘనత
Also Read: India Open 2022 Corona: ఇండియా ఓపెన్ లో కరోనా కలకలం.. ఏడుగురు షట్లర్లకు కొవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook