Sukumar Bollywood Offer: సుకుమార్​కు బాలీవుడ్ ఆఫర్- స్వయంగా కోరిన టాప్ హీరో!

Sukumar Bollywood Offer: తెలుగు టాప్​ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్​కు.. బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. పుష్ప సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హీరో సుకుమార్​కు ఈ ఆఫర్ ఇచ్చాడట.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 03:51 PM IST
  • పుష్ప సినిమాకు బాలీవుడ్​ ప్రముఖుల ప్రశంసలు
  • హీరో అల్లు అర్జున్​తో పాటు డైరెక్టర్​ సుకుమార్​కు అభినందనలు
  • తనతో సినిమా తీయాలని సుకుమార్​కు అక్షయ్​ ఆఫర్​
Sukumar Bollywood Offer: సుకుమార్​కు బాలీవుడ్ ఆఫర్- స్వయంగా కోరిన టాప్ హీరో!

Sukumar Bollywood Offer: అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన 'పుష్ప ది రైజ్' గత ఏడాది డిసెంబర్​ 17న ప్రపంచవ్యాప్తంగా (Pushpa movie) విడుదలైంది. తెలుగుతో పాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా ఏక కాలకంలో విడుదలై ఘన విజయాన్ని సొంతం (Pushpa movie success) చేసుకుంది.

ఇటీవలి కాలంలో దక్షిణాది సినిమాలు.. బాలీవుడ్​లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. 'పుష్ప' సినిమా కూడా హిందీలో మంచి కలెక్షన్లు (Pushpa movie collections) రాబట్టింది. ఇక కలెక్షన్ల మాట అటుంచితే.. ఈ పరిణామం దక్షిణాది దర్శకులు, హీరోలకు బాలీవుడ్ ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి.

'పుష్ప' సినిమాతో పాన్​ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్న సుకుమార్​కు కూడా బాలీవుడ్​ నుంచి (Bollywood offer to Sukumar) పిలుపొచ్చింది.

ప్రముఖ యాక్షన్ హీరో అక్షయ్​ కుమార్​.. 'పుష్ప' సినిమా చూసి అల్లు అర్జున్​, సుకుమార్​పై ప్రశంసలు కురిపించారట. అంతే కాదు.. తనతో ఓ సినిమా చేయాలని కూడా సుకుమార్​ను (Akshay Kumar offer to Sukumar ) కోరాడట అక్షయ్. ఈ విషయాన్న స్వయంగా సుకుమార్ (Sukumar offer on Bollywood offer) వెల్లడించారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన సుకుమార్.. భవిష్యత్​లో అక్షయ్​ కుమార్​తో సినిమా చేస్తానని కూడా (Sukumar offer on Akshay Kumar offer) చెప్పారు.

సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప ది రైజ్'​కు.. కొనసాగింపు అయిన 'పుష్ప ది రూల్'​ సినిమా పనుల్లో బిజిగా ఉన్నారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.

ఈ సినిమా తర్వాత సుకుమార్​ తర్వాతి సినిమా గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఇప్పుడు అక్షయ్​ కుమార్​ లాంటి టాప్​ హీరో ఆఫర్​తో బాలీవుడ్​లో సినిమా తీస్తారా? లేదా తెలుగులో ఏదైనా సినిమా తీస్తారా అనే విషయం ఇంకా తెలియాల్సి (Sukumar next movie) ఉంది.

Also read: Anasuya Sankranthi Celebrations: అనసూయ సంక్రాంతి సంబరాలు.. పార్కులో భర్తతో కలిసి.. !!

Also read: Ghani Movie Special Song: గని నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మరోసారి రచ్చచేసిన తమన్నా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News