Instagram Nationality Challenge: ఇన్​స్టాలో నేషనాలిటీ ఛాలెంజ్​ వీడియో ఎలా చేయాలి?

Instagram Nationality Challenge: ఇన్​స్టాగ్రామ్​లో నేషనాలిటీ ఛాలెంజ్​ ట్రెండ్​ అవుతోంది. మరి ఈ ఛాలెంజ్​తో మీరు వీడియో ఎలా చేయాలో తెలుసా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 06:52 PM IST
  • ఇన్​స్టాలో కొత్త ట్రెండ్​
  • నేషనాలిటీ పేరుతో కొత్త ఛాలెంజ్​​
  • యూత్​లో మంచి క్రేజ్​
Instagram Nationality Challenge: ఇన్​స్టాలో నేషనాలిటీ ఛాలెంజ్​ వీడియో ఎలా చేయాలి?

Instagram Nationality Challenge: సోషల్ మీడియాలో ఇన్​స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్స్ ఫీచర్​ వచ్చాక.. అనేక ఛాలెంజ్​లకు ఇది నిలయంగా మారిపోయిది. తాజాగా కొత్త ట్రెండ్ వచ్చింది. అదే నేషనాలిటీ ఛాలెంజ్ (Nationality Challenge)​.

ఇంతకీ ఏమిటి ఈ నేషనలిటీ ఛాలెంజ్​..

వివిధ దేశాల దుస్తుల్లో తాము ఎలా కనిపిస్తాము.. అనేదే ఈ నేషనాలిటీ (What is Instagram Nationality Challenge) ఛాలెంజ్​. ఇందులో ఇండియా, రష్యా, జపాన్​, అమెరికా, టర్కీ, చైనా, సహా వివిధ దేశాలు ఉన్నాయి. ఈ ఛాలెంజ్​తో వేలాది రీల్స్ అప్​లోడ్ అవుతున్నాయి.

నేషనాలిటీ ఛాలెంజ్​ రీల్​ ఎలా చేయాలి?

ఈ ఛాలెంజ్​ను తీసుకుని.. వివిధ దేశాల దస్తులు ధరించి వీడియో షూట్​ చేసి.. దానిని రీల్స్​లో అప్లోడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా.. సులభంగా ఈ వీడియోను చేసేందుకు ఓ సదుపాయం ఉంది.

నేషనాలిటీ ఛాలెంజ్​ రీల్స్​​ ఎలా చేయాలంటే..

ముందుగా ఫేస్​ప్లే యాప్​ను (Face Play App) డౌన్​లోడ్ చేసుకోవాలి. గూగుల్​ ప్లేతో పాటు యాప్​ స్టోర్​లోనూ ఇది అందుబాటులో ఉంది.

ఇందులో 'For You' అనే సెక్షన్​ను ఎంచుకోవాలి.

ఇక్కడ వివిధ దేశాలకు చెందిన  template ఉంటాయి. అంటే ఇందులో ముందే షూట్ వివిధ దేశాల దుస్తుల్లోని వీడియోలు ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన దేశాలను (How to Do insta Nationality Challenge) సెలెక్ట్ చేసుకోవాలి.

వీడియోలను సెలెక్ట్​ చేసిన తర్వాత.. 'Add a face' అనే ఆప్షన్​పై క్లిక్​ చేసి.. మీ గ్యాలరీలో ఉన్న మీ బెస్ట్ ఫొటోను యాడ్​ చేయండి.

(మీరు సెలెక్ట్ చేసిన ఫొటోలోని ఫేస్​.. మీరు ఎంపిక చేసిన దేశాల సంప్రదాయ దుస్తుల్లోని ఉండే వ్యక్తి ఫేస్​తో మార్ఫ్ అవుతుంది.)

స్టార్​ మేకింగ్ బటన్​ క్లిక చేయాలి.. మీ ఫేస్​తో వీడియో ప్రాసెస్ అవుతుంది. అలా నాలుగైదు దేశాల వీడియోల్లో మీ ఫేస్​తో మార్ఫ్​ చేసిన వీడియోను క్రియేట్​ చేసుకుని.. దానిని ఇన్​స్టా రీల్స్​లో అప్​లోడ్ చేస్తే (Insta latest Trend) సరిపోతుంది.

Also read: Parrot Viral Video: ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించిన అందమైన చిలుక.. వీడియో వైరల్

Also read: CCTV video: కాన్పూర్‌లో ఇంట్లో చొరబడిన దొంగలు.. న్యూజెర్సీ నుంచే పోలీసులకు ఫోన్.. సీన్ కట్ చేస్తే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News