Chhattisgarh: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్... వారానికి ఐదు రోజులే డ్యూటీ..

chhattisgarh government: ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి వారానికి ఐదు రోజులే పని దినాలని ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 06:41 PM IST
  • పెన్షన్ పథకంలో ప్రభుత్వ వాటా పెంపు
  • కనీస మద్దతు ధరతో పప్పు ధాన్యాల కొనుగోలు
  • యువతకు ఉపాధి కల్పన, మహిళల కోసం సేఫ్టీ సెల్స్‌
Chhattisgarh: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్... వారానికి ఐదు రోజులే డ్యూటీ..

Govt employees 5 days work in chhattisgarh: భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic day 2022) పురస్కరించుకుని..తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం (chhattisgarh government). ఇక నుంచి వారానికి ఐదు రోజులు (5 days work) విధులకు హాజరైతే చాలని ప్రకటించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్ష్​దాయీ పింఛను యోజన కోసం ప్రభుత్వం చెల్లించే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది.

కనీస మద్దతు ధరతో పప్పు ధాన్యాల కొనుగోలు
ఉద్యోగులకే కాదు.. కార్మికులకు, రైతులకు, గిరిజనులకు, యువతకు ఉపయోగపడే పథకాలను ప్రకటించింది భూపేశ్​ బఘేల్ సర్కార్. రైతుల నుంచి 2022-23 ఖరీఫ్​ సీజన్​ నుంచి.. పప్పు ధాన్యాలు అన్నింటినీ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే కార్మికులకు జన్మించిన మొదటి ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని పేర్కొంది.

Also Read: Bihar Protests: ఆర్ఆర్‌బీ ఫలితాలపై వివాదం.. అట్టుడుకుతున్న బీహార్.. రైలుకు నిప్పంటించిన విద్యార్థులు

మహిళల కోసం సేఫ్టీ సెల్స్..
అదే విధంగా గిరిజనుల ప్రగతి కోసం సంబంధిత నిబంధనలను సరళతరం చేస్తామని ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ (Bhupesh Baghel) వెల్లడించారు. అక్రమ భవన నిర్మాణాలన్నింటిని క్రమబద్ధీకరించేందుకు ఈ ఏడాది చట్టం తీసుకువస్తామని సీఎం తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మహిళా సేఫ్టీ సెల్స్‌ను (Women Safety Cells) ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News