New Twist in Hyderabad Drug Racket: హైదరాబాద్ మహా నగరంలో బయటపడిన డ్రగ్స్ కేసు (Hyderabad Drug Case)లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్త (Businessman)లను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు వ్యాపారులు గజేంద్ర, విపుల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్‌లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి చాలా ఏళ్లుగా డ్రగ్స్ (Drugs) కొనుగులు చేస్తున్నారు.
టోనీ (Drug Dealer Tony)తో పాటు 9 మంది నిందితులను 7 రోజులు పాటు కస్టడీకి కోరారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task Force Police). కోర్టులో ఈరోజు కస్టడీపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. నిందితులను కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సరైన ఆధారాలతో బడా వ్యాపారవేత్తలను అరెస్ట్ చేయనున్నారు.
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ దగ్గర నుంచి కొన్నేళ్లుగా బడా వ్యాపారవేత్తలు వందల కోట్ల డ్రగ్స్ (Drugs) వ్యాపారం చేస్తున్నారట. లావాదేవీలు అన్ని డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. తన సెల్ ఫోన్లో ఉన్న డాటాను, వాట్సాప్ చాటింగ్‌లను టోనీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకున్నాడట. పోలీసులు టోనీకి సంబంధించిన రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో నుంచి డాటాను, వాట్సాప్ చాటింగ్‌ను రికవరీ చేశారు. టోనీ సెల్ ఫోన్లో మరికొంతమంది వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 34 మందిని పోలీసులు గుర్తించారు.
Also Read: Upasana FB Post: ఉపాసన ఫేస్బుక్ పోస్ట్‌పై రచ్చ రచ్చ.. డిలీట్ చేసెయ్ అంటోన్న నెటిజెన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook