APPLES: యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎ వే. నూటికి నూరుపాళ్లు నిజమే. కానీ ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. యాపిల్స్ తింటే అనారోగ్యం కొనితెచ్చుకోవల్సిన పరిస్థితి. ఆశ్యర్యంగా ఉందా..అయితే ఇది చదవండి మరి.
యాపిల్స్ అంటే ఇష్టపడనివారుండరు. యాపిల్స్‌లో అంతటి పోషక పదార్ధాలుంటాయి. స్వీట్‌గా జ్యూసీగా ఉండే యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులంటారు. యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎ వే అంటారు అందుకే. ఎందుకంటే యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్లు అత్యధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో యాపిల్ చాలా దోహదపడుతుంది. యాపిల్స్‌లో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి.
అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. యాపిల్స్ (Apples) తినేముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే యాపిల్స్‌లో హానికారకమైన బ్యాక్టీరియా ఉంటోంది. ఎశ్చరీషియా షిజెల్లా అనే హానికారకమైన బ్యాక్టీరియా యాపిల్స్‌లో ఉంటోందని నిపుణులు తేల్చారు. వాస్తవానికి ఆపిల్ పండ్లను సేంద్రీయ, సాంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. ఈ రెండు పద్ధతుల్లో కూడా ఆపిల్‌లో బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువగా గింజల్లో, తొక్క, కండ భాగంలో ఉంటుంది. అదే సమయంలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది పేగులకు అవసరం. ఇటీవల ఆపిల్ తోటల్లో పురుగు మందుల వినియోగం బాగా పెరగడంతో..విష రసాయనాలు ఆపిల్ తొక్కపై చేరి ఉంటున్నాయి. అందుకే తొక్క తీసి తినాలంటున్నారు వైద్యులు. కానీ తొక్కభాగంలోనే ఎక్కువ పోషక విలువలుంటాయి. అందుకే సేంద్రీయ పద్ధతుల్లో పండించే యాపిల్స్ తినడం మంచిది. అయితే ఇప్పుడు కొత్తగా చెబుతున్న హానికారకమైన బ్యాక్టీరియాతో(Harmful Bacteria) అనారోగ్య సమస్యలు వెంటాడుతాయంటున్నారు వైద్య నిపుణులు.
Also read: Dark Circles: కంటి కింది నల్లటి వలయాలకు అద్భుతమైన ఇంటింటి చిట్కాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook