Stock Market today: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ 814 పాయింట్లు పెరిగి 58,014 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 238 పాయింట్ల లాభంతో 17,410 వద్ద స్థిరపడింది.
లాభాలకు కారణాలు..
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రేపు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. కరోనా సంక్షోభం నేపథ్యంలో వస్తున్న బడ్జెట్ కావడంతో ఈ సారి బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశ వృద్ధికి ఊతమందించే దిశగా ప్రకటనలు ఉండొచ్చని తెలుస్తోంది. పరిశ్రమలు, ఆర్థిక సంస్థలను ప్రోత్సహించే విధంగా కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలన్నంటి నేపథ్యంలో మదుపరులు నేడు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీనితో సూచనీలు నేడు రికార్డు స్థాయిలో లాభాలను గడించాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నేటి సెషన్లో అన్ని రంగాలు భారీగా లాభాలను గడించాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా పుంజుకున్నాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 58,257 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. ఒకానొక దశలో 57,746 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 17,410 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,264 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 23 కంపెనీలు లాభాలను గడించాయి. మూడు సంస్థలు మాత్రమే నష్టపోయాయి.
టెక్ మహీంద్రా 4.88 శాతం, విప్రో 3.70 శాతం, బజాజ్ ఫినాన్స్ 3.22 శాతం, ఇన్ఫోసిస్ 3.05 శాతం, ఎస్బీఐ 2.87 శాతం లాభాలను గడగించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ 3.51 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.14 శాతం, హెచ్‌యూఎల్ 0.38 శాతం చొప్పున నష్టాలను నమోదు చేశాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), థైవాన్ సూచీలు సెలవులో ఉన్నాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 43 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద కొనసాగుతోంది.
Also read: Flipkart Electronics Sale 2022: రూ.4,500లకే శాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ- ఈరోజే తుదిగడువు!
Also read: Lenovo Legion Y90 : వావ్!! ప్రపంచంలోనే మొట్టమొదటి 22GB RAM స్మార్ట్ ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook