Assam Chirang District Journalist incident: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ పోలీసులను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై దాడి జరిగింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిని శిక్షించాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘించి.. దాడులకు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్ట్‌పై కానిస్టేబుల్స్ (Constables) దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తాజాగా అసోంలో జరిగింది.
అసోంలోని చిరాంగ్ జిల్లా బసుగావ్‌లో ఇద్దరు పోలీసులు హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తుండగా జయంత దేవ్‌నాథ్ అనే జర్నలిస్ట్ గమనించారు. హెల్మెట్ (Helmet) లేకుండా బైక్‌పై వెళ్తున్నారు... సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరు పోలీసులు తమనే ప్రశ్నిస్తావా అంటూ జర్నలిస్ట్ జయంత దేవ్‌నాథ్‌పై దాడికి పాల్పడ్డారు. చెంపపై, తలపై ఇష్టానుసారంగా కొట్టారు. నోటికొచ్చినట్లుగా తిట్టారు.
ఇంతలో అక్కడికి ఒక పోలీస్ (Police) వాహనంలో పోలీసులు వచ్చినా వారు దాడిని అడ్డుకోలేదు. పైగా జర్నలిస్ట్ జయంత్‌ను బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ దాడికి పాల్పడ్డ ప్రదీప్ సాహా, లఖీ బర్మన్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్‌పై 341, 323, 427 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయింది. విచారణ కొనసాగుతోంది.
ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ కొనసాగుతోందని చిరాంగ్ (Chirang) ఎస్పీ ప్రణబ్ బోరా తెలిపారు. 20 రోజుల్లోగా విచారణ నివేదికి సమర్పిస్తామని చెప్పారు. అంతేకాదు హెల్మెట్ ధరించకుండా బైక్‌పై ప్రయాణం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిపారు.
అయితే పోలీసులు రూల్స్ పాటించకపోగా.. దాడికి పాల్పడడం ఎంత వరకు సమంజసం అంటూ జర్నలిస్ట్ జయంత దేవ్‌నాథ్ ప్రశ్నించారు. తాను ఒక జర్నలిస్ట్‌గా (Journalist) బాధ్యతగా ప్రశ్నిస్తే కూడా ఇలా రెచ్చిపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పోలీసులకు "ఫ్రీ హ్యాండ్" ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఆయన పేర్కొన్నారు.
Basugaon, Assam | 2 policemen on a bike were not wearing helmets,my only fault was that I questioned them saying what message would it give to general public.They abused, assaulted me in broad daylight. When I told them I'm a journalist, they got more furious: Jayant Debnath(7.2) pic.twitter.com/N5rKfNRjWT
— ANI (@ANI) February 7, 2022
ఇక గౌహతి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మనోజ్ నాథ్ కూడా ఈ ఘటనను ఖండించారు. జర్నలిస్ట్‌పై పోలీసులు (Police) దాడులకు పాల్పడడం ఏమాత్రం సరికాదన్నారు. అలాగే అసోం (Assam) స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ కూడా ఈ ఘటనపై (Incident) విచారణ వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.
Also Read: Corona Third wave: తెలంగాణలో మగిసిన కొవిడ్ థార్డ్వేవ్- డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook