హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం మరోసారి ఫైర్ అయ్యారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపి పెద్ద తప్పు చేశారు. ఆ పనిచేసింది నెహ్రూనే కదా అంటూ కేసీఆర్ విమర్శలు సంధించారు. నెహ్రూ నిర్ణయానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుడ్డిగా తల ఊపడం వల్లే తెలంగాణ అపట్లో ఏపీలో విలీనమైందని ఆరోపించారు.
తెలంగాణకు తొలి ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే
తెలంగాణకు మొట్టమొదటి విలన్ ఎవరైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ విమర్శించారు. ఈ విషయాన్ని తాను కొత్తగా ఏమీ మాట్లాడటం లేదని.. 18 ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని తాను చెప్పానన్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని కేసీఆర్ ఆరోపించారు. సభలో అమార్యదగా ప్రవర్తించడం వల్లే కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.