IPL 2022, KKR New Captain: ఐపీఎల్ 2022లో భాగంగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎంపికయ్యాడు. ఈ మేరకు కేకేఆర్ యజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో (IPL Mega Auction) ఇతడిని రూ.12.25కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. గతేడాది శ్రేయస్ దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు.
ప్రస్తుత కేకేఆర్ కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ నుండి అయ్యర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. మోర్గాన్ నేతృత్వంలోని కేకేఆర్ (Kolkata Knight Riders) గత సంవత్సరం ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటి వరకు అయ్యర్ ఐపీఎల్ లో 41 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. అందులో 21 మ్యాచ్ లు గెలిచి...18 ఓడిపోయాడు. రెండు మ్యాచ్లు టైగా ముగిశాయి. గత ఐపీఎల్ తర్వాత అయ్యర్ న్యూజిలాండ్ పై తన అరంగ్రేటం మ్యాచ్ ను ఆడాడు.
"కేకేఆర్ వంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. వివిధ దేశాల అత్యుత్తమ ఆటగాళ్లు ఉండే జట్టును నడిపించడానికి నేను ఎదురు చూస్తున్నాను." అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కేకేఆర్ జట్టు ప్రధాన కోచ్ గా బ్రెండన్ మెక్ కలమ్, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ఉన్నారు.
ఇషాన్ కిషన్- 15.25 కోట్లు (ముంబై ఇండియన్స్), దీపక్ చాహర్-14 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్) తర్వాత అయ్యర్‌ను నైట్ రైడర్స్ ఐపీఎల్ మెగా వేలంలో మూడో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కొనుగోలు చేసింది.
Also Read: India vs West Indies : టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook