Scientists Discovers Baby Ghost Sharks: న్యూజిలాండ్ సైంటిస్టులు ఓ అరుదైన బేబీ ఘోస్ట్ షార్క్‌ని కనుగొన్నారు. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపానికి తూర్పు తీరాన ఉన్న సముద్రంలో 1.2కి.మీ లోతులో దీన్ని కనుగొన్నారు. ఈ షార్క్ ఇటీవలే పొదగబడి ఉంటుందని సైంటిస్టులు వెల్లడించారు. ఈ షార్క్‌ను చిమెరా అని కూడా పిలుస్తారని.. సముద్రపు అడుగు భాగంలో ఉండే వీటిని గుర్తించడం అత్యంత అరుదని పేర్కొన్నారు.
నిజానికి ఇవి షార్క్స్ కాదని.. ఆ జాతులకు సంబంధించిన లాంటి జీవులని తెలిపారు. వీటికి, షార్క్స్‌కి అస్తిపంజరాలు ఉండవని.. ఇవి మృదులాస్థిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. చాలాకాలంగా మెరైన్ బయాలజిస్టులు ఘోస్ట్ షార్క్స్‌పై పరిశోధనలు జరుపుతున్నారు. వాటి స్వభావాన్ని, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సైంటిస్టులు కనుగొన్న బేబీ ఘోస్ట్ షార్క్ ఆ పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
న్యూజిలాండ్ సైంటిస్టుల బృందంలో ఒకరైన డా.ఫినుచి మాట్లాడుతూ... ఆ బేబీ ఘోస్ట్ షార్క్ నుంచి కొన్ని కణజాలాలను, జన్యువులను సేకరించి వాటిని విశ్లేషించనున్నట్లు తెలిపారు. ఇవి సముద్రపు అడుగు భాగంలో నత్తలు, పురుగులను తింటూ జీవిస్తాయని పేర్కొన్నారు. పెద్ద ఘోస్ట్ షార్క్‌లు పరిమాణంలో 2మీ. పొడవు ఉంటాయని తెలిపారు. న్యూజిలాండ్ సైంటిస్టులు కనుగొన్న బేబీ షార్క్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook