Kandlakoya Gate Way: నార్త్ హైదరాబాద్‌కు కండ్ల‌కోయ‌ ఐటీ పార్క్‌ ఒక ఆరంభం.. ముందు ముందు ఇసోంటివి మస్తు వస్తయ్!

KTR lays foundation stone for Kandlakoya Gate Way: మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ఐటీ పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌.. కండ్లకోయ భవిష్యత్తులో ఒక రేంజ్‌లో డెవలప్‌ అవుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి హైదరాబాద్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 05:42 PM IST
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడడం వల్లే కండ్ల‌కోయ‌లో ఐటీ పార్క్‌
  • నార్త్‌ హైద‌రాబాద్‌కు ఈ ఐటీ పార్క్‌ ఒక ఆరంభం మాత్రమే
  • ఈ గేట్ వే ఐటీ పార్క్‌ వల్ల ఎంతో మందికి ఉపాధి
  • మంత్రి కేటీఆర్ వెల్లడి
Kandlakoya Gate Way: నార్త్ హైదరాబాద్‌కు కండ్ల‌కోయ‌ ఐటీ పార్క్‌ ఒక ఆరంభం.. ముందు ముందు ఇసోంటివి మస్తు వస్తయ్!

Kandlakoya Gate Way: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడడం వల్లే నేడు కండ్ల‌కోయ‌లో ఇంత పెద్ద ఐటీ పార్క్‌ను నిర్మించుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నార్త్‌ హైద‌రాబాద్‌కు ఈ గేట్‌ వే ఐటీ పార్క్‌ అనేది ఒక ఆరంభం మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. కండ్ల‌కోయ‌లో భారీ ఎత్తున నిర్మించనున్న ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాప‌న చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌ పలు అంశాలపై మాట్లాడారు. 

సీఎం కేసీఆర్ తెలంగాణ‌ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్‌ను స్థాపించినప్పుడు ఆయన వద్ద అసలు ఏమీ లేదన్నారు. 14 సంవత్సరాలు కేసీఆర్‌‌ అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ‌ సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. దాని వల్లే ఈ రోజు కండ్ల‌కోయ‌లో ఐటీ పార్క్‌ను నిర్మించుకుంటున్నామని కేటీఆర్‌‌ అన్నారు. ఒకవేళ కేసీఆర్‌ ఆనాటి పరిస్థితుల వల్ల పొరపాటున రాజకీయాలను వదిలి పెట్టి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన.. సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు.

నార్త్‌ హైద‌రాబాద్‌లో ఇప్పటికే భారీ ఎత్తున ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ట్రెడిష‌న‌ల్ డిగ్రీ కళాశాలలు, ఎంబీఏ, మెడికల్, ఫార్మసీ తదితర కాలేజీలు ఉన్నాయన్నారు. అలాగే ఏటా దాదాపు ఇరవై వేల మంది ఇక్కడే ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారని.. వారంతా ఉత్తర హైద‌రాబాద్‌లోనే ఉద్యోగాలు చేసే వెసులుబాటు కల్పించే విధంగా ఐటీ పార్క్‌లు నిర్మిస్తున్నామన్నారు. 

ఈ గేట్ వే ఐటీ పార్క్‌ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌‌ పేర్కొన్నారు. నార్త్‌ హైద‌రాబాద్‌లో ఇది ఒక ఆరంభం మాత్రమేనని... దీన్ని ఇంకా ఎంతో భారీగా విస్తరిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఉత్తర హైదరాబాద్‌కు ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉందని మంత్రి స్పష్టం చేశారు. 

 

ఈ ఏడున్నర సంవత్సరాలలో ఎన్నో టాప్‌ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని మంత్రి కేటీఆర్‌‌ వెల్లడించారు. అమెజాన్ వరల్డ్‌లోనే బిగ్గెస్ట్‌ క్యాంప‌స్‌ను హైద‌రాబాద్‌లోనే ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్‌‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో హైద‌రాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

Also Read: విడిగా పడుకోండి.. అవసరమైతే భార్యలను దండించండి.. భర్తలకు మహిళా మంత్రి సలహాలు..

Also Read: Amazon Sale: అమెజాన్ ఎలక్ట్రానిక్ సేల్.. హెడ్ ఫోన్స్ పై 86 శాతం డిస్కౌంట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News