Minor girl Gang Rape: పుట్టిన రోజున అలిగి పారిపోయిన మైనర్ బాలిక.. నమ్మించి మోసం చేసిన నలుగురు యువకులు!!

Minor girl Gang Rape on Birthday: పుట్టిన రోజున ఇంట్లో అలిగి వెళ్లిన ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 03:07 PM IST
  • ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు
  • పుట్టిన రోజున అలిగి పారిపోయిన మైనర్ బాలిక
  • నమ్మించి మోసం చేసిన నలుగురు యువకులు
Minor girl Gang Rape: పుట్టిన రోజున అలిగి పారిపోయిన మైనర్ బాలిక.. నమ్మించి మోసం చేసిన నలుగురు యువకులు!!

Minor girl Gang Rape on Birthday in Karnataka: దేశంలో ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా అత్యాచారాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు, మైనర్ బాలికలు, మహిళలు తేడా లేకుండా కామాంధులకు బలవుతున్నారు. శుక్రవారం కూడా ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ 14 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు. తల్లిదండ్రులు తన పుట్టినరోజున కొత్త బట్టలు మరియు చాక్లెట్లు కొనివ్వలేదని అలిగి ఇంటినుంచి బయటికి వచ్చింది. ఆ మైనర్ బాలిక పాఠశాలకు వెళ్లకుండా.. బస్సులో బంగారపేటకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నలుగురు యువకులు ఆమెతో మాటలు కలిపారు. ఆపై ఒక పార్కుకు తీసుకెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడిపారు. 

సాయంత్రం సమయంలో నిందితులు బాధితురాలిని ఓ ప్రైవేట్ బస్సులో తానిమడగు గ్రామానికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో మద్యం సేవించిన యువకులు బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడ పెద్దగా అరుపులు వినిపించడంతో దారిన వెళ్తున్న కొందరు బాలిక పరిస్థితిని చూసి బంగారుపేట ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి సమాచారం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి ఆధారాలతో  నిందితులను పట్టుకున్నారు. ఆనంద్‌ కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణు అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోమని బాలిక తల్లిదండ్రులు కోరారు. 

Also Read: Samantha Photos: బాహుబలి జలపాతం వద్ద ప్రకృతిలో మమేకమైన సమంత

Also Read: Punjab Election 2022: సోనూ సూద్​ను అడ్డుకున్న ఎన్నికల సంఘం అధికారులు- కారు సీజ్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News