ఎన్నారైలు.. స్వదేశంలో లోన్ కావాలా..

  

Last Updated : Oct 20, 2017, 06:49 PM IST
ఎన్నారైలు.. స్వదేశంలో లోన్ కావాలా..

మీరు ఎన్నారైలా.. అయినా మీ సొంత దేశంలో ఏదైనా ప్రాపర్టీ కొనడం కోసం లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా.. ఏం ఫర్లేదు.. ఈ క్రింది అంశాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. భారతదేశంలో ఇంటి రుణాలు తీసుకోవాలనుకొనే ప్రవాస భారతీయుల కోసమే ఈ టిప్స్..

  • ప్రవాస భారతీయులు ఈ దేశంలో లేకపోయినా..  ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనే నిమిత్తం ఇంటి రుణాలు తీసుకోవచ్చు. అందుకు ఏ బ్యాంకు కూడా అభ్యంతరం చెప్పదు. అయితే, మీతో పాటు భారతీయ పౌరుడైన వ్యక్తి ఎవరైనా కో అప్లికెంట్‌గా ఉండాలి.
  • అలాగే ఈ విధంగా లోన్ పొందాలంటే మీ వయసు కనీసం 24 సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మూడు నెలల సేలరీ స్టేట్‌మెంట్ తప్పక అందివ్వాలి
  • ఎన్నారైలు భారతదేశంలో లోన్ పొందాలంటే, వారికి సలహాలు అందించడానికి అనేక ఆన్‌లైన్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మీ వివరాలను ఆన్‌లైన్‌లోనే అందించి, ఏ ఏ బ్యాంకులు మీకు లోన్ అందిస్తున్నాయో తెలుసుకోవచ్చు. 
  • ఇలాంటి రుణాలను పొందే ఎన్నారైలు, తమ కో అప్లికెంట్ పేరు మీద "పవర్ ఆఫ్ అటార్నీ" కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ కో అప్లికెంట్స్‌గా కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితులను ఎంచుకోవచ్చు. ఎందుకంటే, మీరు తీసుకొనే రుణానికి మీ కో అప్లికెంట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • సాధారణంగా ఇలాంటి రుణాలకు బ్యాంకులే "పవర్ ఆఫ్ అటార్నీ" ఫార్మాట్ అందిస్తాయి. దానిలో మీ వివరాలతో పాటు మీ కో అప్లికెంట్ వివరాలు కూడా నింపాక, దానిని వెరిఫికేషన్ నిమిత్తం ఇండియన్ ఎంబసీకి పంపించి, ఆమోద ముద్రను సీల్ రూపంలో వేయించుకోవాల్సి ఉంటుంది. రుణం తీసుకొనే వ్యక్తి కచ్చితంగా ప్రవాస భారతీయుడే అని నిర్థారించడానికే ఈ పద్ధతి.
  • ఒకవేళ మీరు రుణం తీసుకున్నాక, అదే రుణాన్ని స్వదేశంలో వేరే బ్యాంకుకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలని భావిస్తే, మీ మొదటి బ్యాంకుకి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఆ రుసుము ఎక్కువ కూడా ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు అలాంటి రుసుము ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు కూడా వర్తిస్తాయని మీ కొత్త బ్యాంకు చెప్పవచ్చు. కనుక, ఈ ఛార్జిల విషయంలో ముందుగా అడిగి ఒక క్లారిటీకి రావాలి. 
  • అలాగే తీసుకొనే రుణానికి వడ్డీరేట్లు ఎలా ఉన్నాయి అన్న విషయం మీద కూడా అవగాహన అవసరం. మార్కెట్ రేటు బట్టి అవి మారే అవకాశం కూడా ఉంది. 
  • మీ  సంవత్సరం వడ్డీని ఒకేసారి ప్రీ పేమెంట్ చేయాలని భావిస్తే, మీ ట్యాక్స్ పరిమితులను కూడా చూసుకోండి.
  • సాధారణంగా ఈ రుణాలు ఉద్యోగస్తులైతే టెన్యూర్ 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అదే సెల్ఫ్ ఎంప్లాయ్స్‌కు ఆ పరిమితి 20 సంవత్సరాలు మాత్రమే.
  • కచ్చితంగా ఇల్లు కొనడానికే ఈ లోన్ తీసుకోవాలని మీరు భావిస్తే, ముందు లోన్ అప్రూవ్ అయ్యి డబ్బు చేతికొచ్చాకే ప్రాపర్టీ కొనడం మంచిది
  • మంచి మన్నికైన ప్రాపర్టీ కొనే విషయంలో అయితే బ్యాంకులు ఎప్పుడూ రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి
  • ప్రస్తుతం ఎన్నారైలకు కూడా ఇంటి రుణాల వడ్డీ రేట్లు స్వదేశీయులతో సమానంగానే ఉన్నాయి 

 

 

Trending News