India post 185 target to West Indies in 3rd T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసి.. విండీస్ ముందు 185 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అర్థ శతకతం (65; 31 బంతుల్లో 1x4, 7x 6)తో చెలరేగగా.. వెంకటేష్ అయ్యర్ (35; 19 బంతుల్లో 4x4, 2x 6) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ (34; 31 బంతుల్లో 5x4) రాణించాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, డొమినిక్ డ్రేక్స్, హేడెన్ వాల్ష్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జేసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించారు. అయితే స్వల్ప వ్యవధిలో శ్రేయస్, ఇషాన్ పెవిలియన్ చేరారు. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ (7) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
Innings Break!
A 37-ball 91-run stand between @surya_14kumar (65) and Venkatesh Iyer 35* powers #TeamIndia to 184/5. 💪 💪
Over to our bowlers now. 👍 👍 #INDvWI | @Paytm Scorecard ▶️ https://t.co/2nbPwMZwOW pic.twitter.com/1QbTNAk0V5
— BCCI (@BCCI) February 20, 2022
ఇక ఇన్నింగ్స్ చివరలో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ చెలరేగి ఆడారు. డ్రెక్స్ వేసిన 16 ఓవర్లో సూర్య ఓ సిక్స్ బాదగా.. వెంకటేశ్ రెండు ఫోర్లు బాదాడు. షెఫర్డ్ వేసిన 17వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. సూర్య, వెంకీ చెలరేగడంతో 19 ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు సిక్సర్లు బాది చివరి బంతికి ఔట్ అయ్యాడు. సూర్య, వెంకీ ధాటికి భారత్ చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 86 పరుగులు పిండుకుంది.
Also Read: Petrol Prices Hikes: సామాన్యుడిపై పెట్రో భారం.. లీటరుకు రూ.8 పెరగనున్న ధర! ఎప్పటినుంచో తెలుసా?
Also Read: Saha journalist: ఇదేనా జర్నలిజం అంటే.. చెంచాగిరి చేయడం ఆపండి! ఫైర్ అవుతున్న హర్భజన్, సెహ్వాగ్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook