Petrol Prices Hikes: సామాన్యుడిపై పెట్రో భారం.. లీటరుకు రూ.8 పెరగనున్న ధర! ఎప్పటినుంచో తెలుసా?

Fuel Prices to increase In India: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో భారాన్ని సామాన్యుడిపై మోపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సమాచారం తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 08:56 PM IST
  • సామాన్యుడిపై పెట్రో భారం
  • లీటరుకు రూ.8 పెరగనున్న పెట్రోలు ధర
  • చాలా దేశాల్లో కొండెక్కి కూర్చున్న పెట్రోల్ ధరలు
Petrol Prices Hikes: సామాన్యుడిపై పెట్రో భారం.. లీటరుకు రూ.8 పెరగనున్న ధర! ఎప్పటినుంచో తెలుసా?

Petrol Prices may Hikes Rs 8 in India: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రో మంటతో అమెరికా, పాకిస్థాన్, అస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు లబోదిబో అంటున్నాయి. అయితే భారత దేశంలో మాత్రం గత మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పులు లేవు. ఇందుకు కారణం లేకపోలేదు.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడమే. 

 ఐఓసీఎల్ శుక్రవారం దేశంలో ఇంధన చమురు ధరను ప్రకటించింది. ఈరోజుకి ఇంధన చమురు ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఇంచుమించు 100 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. 2021 నవంబర్ 4 నుంచి భారత్‌లో ఇందనపు ధరలు  పెరగలేదు. ఈ రోజుల్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 80 నుంచి 94 డాలర్లకు పెరిగింది. అతి త్వరలోనే బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు చేరుతుందని నిపుణలు అంటున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 45 పైసలు పెరుగుతుంది. నవంబర్‌ 4 నుంచి పెరిగిన బ్యారెల్ ధరల ప్రకారం.. భారత్‌లో ఇంధనపు ధరలు రూ.6కి పైగానే పెరగాలి. ఇక పన్నులతో  కలిపి రూ.8కి చేరుతుంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ ఖర్చును అంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే మొత్తం భారాన్ని సామాన్యుడిపై మోపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సమాచారం తెలుస్తోంది. 

నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు అయితే వరుసగా ధరలు పెరగడంతో సామాన్యుడు బైక్ తీయాలంటేనే భయపడ్డాడు. అయితే నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఒక్కసారిగా 10 రూపాయలు తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే మార్చిలో మళ్లీ భారం పడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. 

Also Read: Saha journalist: ఇదేనా జర్నలిజం అంటే.. చెంచాగిరి చేయడం ఆపండి! ఫైర్ అవుతున్న హర్భజన్, సెహ్వాగ్!!

Also Read: Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండానే గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. అదెలాగంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News