BSNL Recharge Plan: ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా.. కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఇప్పుడు వీటికి పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా వినియోగదారుల కోసం చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టనుంది. రూ. 200ల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్ లో అపరిమిత కాల్స్ తో పాటు హైస్పీడ్ డేటాను 100 రోజుల వ్యాలిడిటీని ఇవ్వనుంది. ఆ రీఛార్జ్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL రూ. 197 రీఛార్జ్ ప్లాన్
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెలికాం సంస్థ ఇప్పుడు రూ. 197 ధరతో రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ తో పాటు రోజుకు 2 GB డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. వీటితో పాటు రోజుకు 100 SMSలు కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ 100 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. అందులోని మొదటి 18 రోజుల మాత్రమే డేటా, SMS సర్వీసులు ఉచితంగా లభిస్తాయి.
Zing యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
రూ.197 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు హైస్పీడ్ డేటా, SMSలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు జింగ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా పూర్తిగా ఉచితంగా లభించనుంది.
మరోవైపు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా.. రూ.200 కంటే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అమలులో ఉన్నాయి. కానీ, పై కంపెనీలలో ఏవీ ఎక్కువ వ్యాలిడిటీని యుజర్లకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో బీఎస్ఎన్ఎల్ ఎక్కువ రోజుల వ్యాలిడిటీని కస్టమర్లకు అందజేస్తుంది.
Also Read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!
Also Read: Airtel Recharge Plan: ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఏడాది పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook