Ukraine President: రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ కోసం సామదాన దండోపాయాల్ని ప్రయోగిస్తున్న రష్యా ఇప్పుడు ట్రోలింగ్ ప్రారంభించింది. దేశాధ్యక్షుడు పారిపోయాడంటూ ప్రచారం చేస్తోంది. అయితే యుక్రెయిన్ సరైన రీతిలో ఖండించింది.
యుక్రెయిన్‌పై పోరు ప్రారంభించిన రష్యా అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఆర్మీ, వైమానిక, జల మార్గాల్లో దాడులకు దిగుతోంది. ముప్పేటదాడి చేస్తున్నా యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ క్రమంలో యుక్రెయిన్ బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు వ్యూహం పన్నింది. అవాస్తవాల్ని ప్రచారం చేయడం ప్రారంభించింది. యుక్రెయిన్ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పారిపోయాడంటూ ప్రచారం ప్రారంభించింది. యుద్ధంతో ప్రాణభయంతో పోలండ్‌కు పారిపోయాడని రష్యా పార్లమెంట్ సభ్యుడు ఒకరు ఆరోపించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేశారు.
ఈ వార్తల్ని యుక్రెయిన్ ఖండించింది. రష్యా వాదనల్ని ప్రతిఘటించింది. తమ దేశాధ్యక్షుడు కీవ్ నగరంలోనే ఉన్నారని..ఎక్కడికీ పారిపోలేదని యుక్రెయిన్ స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా ఈ తరహా వార్తల్ని రష్యా ప్రచారం చేసింది. వెంటనే యుక్రెయిన్ అధ్యక్షుడు ఆ వార్తల్ని తిప్పికొట్టారు. ఈ ట్రోలింగ్‌కు ఓ నేపధ్యం కూడా ఉంది. జెలెన్స్కీ దేశం విడిచిపెట్టాలని అమెరికా ప్రతిపాదించింది. యూఎస్ చేసిన ప్రతిపాదనను వ్లాదిమిర్ జెలెన్స్కీ పూర్తిగా తిరస్కరించారు. పారిపోవడం కాదు..ఆయుధాలిమ్మని అడిగాడు. దీన్ని ఆసరాగా చేసుకుని రష్యా మరోసారి ప్రచారం ప్రారంభించిందని తెలుస్తోంది.
Also read: Putin Wax Statue: ఆ మ్యూజియంలో పుతిన్ మైనపు విగ్రహం తొలగింపు- జెలన్స్కీకి చోటు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook