183 people reaches to India from Ukraine: భూతలం, గగనతలం అనే తేడా లేకుండా ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. 11వ రోజుకు చేరుకున్న ఈ యుద్దంలో ప్రధాన నగరాలపై వరుసగా దాడి చేస్తోంది. దాంతో ఇప్పటికే అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. రష్యా దాడి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా మరియు ఇతర ప్రాంతాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఉక్రెయిన్ నుంచి మరో 183 మంది భారత విద్యార్థులు సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆపరేషన్ గంగలో భాగంగా నడుపుతున్న ప్రత్యేక వాయుసేన విమానంలో విద్యార్థులు ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. వారందరికీ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ స్వాగతం పలికి అక్కడి వివరాలు కనుకున్నారు. మరో 2200 మంది ఆదివారం భారత్ చేరుకోనున్నారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
రష్యా విధ్వంసం సృష్టించడంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకీ ఆచమ్యగోచరంగా మారాయి. భారత విద్యార్థులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. దాంతో తమని ఎలాగైనా ఇక్కడి నుంచి తరలించాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం విద్యార్థుల తరలింపు కార్యక్రమం పూర్తయ్యే వరకు కాల్పుల విరమణను పాటించాలని రష్యా, ఉక్రెయిన్‌ను కోరింది. అందుకు అనుమతి రావడంతో విద్యార్థులు వరుసగా స్వదేశానికి చేరుకుంటున్నారు.
Received 183 of our Indian students stranded in Ukraine who returned to the Motherland today.
More than 2,200 Indians are expected to be back home today.
The government is leaving no stone unturned in bringing back its citizens from the conflict zone.#OperationGanga 🇮🇳 pic.twitter.com/r40QMR5wGY
— Bhupender Yadav (@byadavbjp) March 6, 2022
మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. అక్కడి వారిని ఎలాగైనా స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా 14000 మందిని భారత్‌కు వచ్చారు. గత 24 గంటల్లో 2,900 మంది మన దేశానికి చేరుకున్నారు. మరో 2200 మంది ఈరోజు రానున్నారు.
Also Read: INDW vs PAKW: పాకిస్తాన్‌పై ఘన విజయం.. వన్డే ప్రపంచకప్ 2022లో భారత్ బోణీ!!
Also Read: Roja on Mahesh Babu: మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ చెప్పిన ఎమ్మెల్యే రోజా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook