Movie Director Arrest: అత్యాచార కేసులో సినీ దర్శకుడి అరెస్ట్... పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం!

Malayalam Movie Director Arrest: మలయాళ దర్శకుడు లిజు కృష్ణ (36) అత్యాచార ఆరోపణల కేసులో అరెస్టయ్యారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 03:27 PM IST
  • మలయాళ దర్శకుడు లిజు కృష్ణ అరెస్ట్
  • అత్యాచార కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • షూటింగ్‌లోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
Movie Director Arrest: అత్యాచార  కేసులో సినీ దర్శకుడి అరెస్ట్... పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం!

Malayalam Movie Director Arrest: మలయాళ దర్శకుడు లిజు కృష్ణ (36) అత్యాచార ఆరోపణల కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం లిజు కృష్ణ తెరకెక్కిస్తున్న 'పదవెత్తు' చిత్ర యూనిట్‌లో ఒకరైన ఓ మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆర్నెళ్లుగా లిజు కృష్ణ తనపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడని.. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కన్నూరు జిల్లాలోని కక్కనాడ్ ఇన్ఫోపార్క్‌ పోలీస్ స్టేషన్‌లో లిజు కృష్ణపై కేసు నమోదైంది. 

బాధిత మహిళతో లిజు కృష్ణకు కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య సహ జీవనానికి దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి కృష్ణ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు... షూటింగ్‌లో ఉండగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. లిజు కృష్ణను పోలీసులు సోమవారం (మార్చి 7) మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. 

'పదవెత్తు' చిత్రంతో లిజు కృష్ణ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. తొలి సినిమా షూటింగ్ దశలోనే కృష్ణ అరెస్టవడం మాలీవుడ్‌లో కలకలం రేపింది. పదవెత్తు చిత్రంలో నివిన్ పౌలీ, మంజు వారియర్ నటిస్తున్నారు. నటుడు సన్నీ వేన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లిజు అరెస్టుతో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. కోర్టు తీర్పు తర్వాత మూవీ మేకర్స్ నుంచి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. 

Also Read: Jr NTR Fans: మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌! ఎక్కడో తెలుసా?

Also Read: Telangana Budget Session: గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన.. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News