ICC Test Rankings: Ravindra Jadeja becomes world Number One All-Rounder: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, సర్ రవీంద్ర జడేజా టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 'తగ్గేదే' అంటూ.. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంకు దూసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో భారీ సెంచరీ (175 నాటౌట్), 9 వికెట్లు పడగొట్టడంతో రెండు స్థానాలు మెరుగుపరచుకుని 406 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ ఒక స్థానం దిగజారి.. 382 పాయింట్లతో రెండో స్థానానికి చేరాడు. ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం కోల్పోయి 347 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పదో స్థానానికి దూసుకొచ్చాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చేరిన మొదటి భారత వికెట్ కీపర్‌గా పంత్ తన పేరుపై ఓ రికార్డు నెలకొల్పాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే పంత్ టాప్ 10లోకి రావడం విశేషం. ఇప్పటివరకు 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పంత్.. 40 సగటుతో 1831 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 763 రేటింగ్ పాయింట్లతో మాజీ సారథి విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా.. 761 రేటింగ్ పాయింట్లతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు. 723 రేటింగ్ పాయింట్లతో రిషబ్ పంత్ 10వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Jadeja reaches the summit 👑
Kohli, Pant move up ⬆️Some big movements in the latest update to the @MRFWorldwide ICC Men's Test Player rankings 📈
Details 👉 https://t.co/BjiD5Avxhk pic.twitter.com/U4dfnrmLmE
— ICC (@ICC) March 9, 2022
ఇక బౌలర్ల జాబితాలో భారత్ నుంచి టాప్ 10లో ఇద్దరికి చోటు దక్కింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉండగా.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు. యాష్ ఖాతాలో 850 రేటింగ్ పాయింట్లు ఉండగా.. బుమ్రా ఖాతాలో 766 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తొలి స్థానంలో ఉన్నాడు. కమిన్స్ ఖాతాలో 892 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
Also Read: Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారిగా ఖాళీ వివరాలు ఇవే! అత్యధికంగా హైదరాబాద్‌లో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook