Hyderabad Bullet Train: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ - విజయవాడ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టాలని ఎప్పటినుంచే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పుడదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ రెండు ప్రధాన నగరాలను బుల్లెట్ ట్రైన్ ద్వారా కలపడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
దీంతో పాటు హైదరబాద్ నుంచి బెంగళూరు, ముంబయి వంటి మెట్రో నగరాలను కలుపుతూ.. బుల్లెట్ ట్రైన్స్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీ అయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచాలన్న ప్రతిపాదన ఇంకా నెరవేరలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, విజయవాడ, ముంబయి ప్రాంతాలను హైదరాబాద్ తో కనెక్ట్ చేసే విధంగా బుల్లెట్ రైలు లేదా హైస్పీడ్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని గుర్తుచేశారు.
Also Read: TS budget sessions 2022: అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
Also Read: Telangana: ప్రధాని మోదీతో సమావేశమైన తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook