Summer Tips: వేసవిలో ఎంత నీరు తీసుకోవాలి, ఒకేసారి తీసుకోవడం ఎందుకు ప్రమాదకరం

Summer Tips: వేసవి వచ్చిందంటే చాలు ఎవరికైనా ఆందోళనే. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండకతప్పదు. లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. అందుకే సాధ్యమైనంతగా ఎక్కువ వీరు తీసుకోవాలి. ఎంత నీరు తీసుకోవాలనేది పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2022, 04:25 PM IST
Summer Tips: వేసవిలో ఎంత నీరు తీసుకోవాలి, ఒకేసారి తీసుకోవడం ఎందుకు ప్రమాదకరం

Summer Tips: వేసవి వచ్చిందంటే చాలు ఎవరికైనా ఆందోళనే. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండకతప్పదు. లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. అందుకే సాధ్యమైనంతగా ఎక్కువ వీరు తీసుకోవాలి. ఎంత నీరు తీసుకోవాలనేది పరిశీలిద్దాం..

బతికేందుకు గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. శరీరానికి తగినంత నీరు అందకపోతే..వేసవి కానప్పుడు కూడా డీ హైడ్రేషన్ సమస్య వెంటాడుతుంటుంది. అటువంటిది వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. శరీరానికి కావల్సిన నీరు అందించకపోతే..వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తగినంత మొత్తంలో శరీరానికి అందించాల్సి ఉంటుంది. నీరు తగినంతగా అందితేనే..శరీరంలోని భాగాలు సరిగ్గా పనిచేస్తాయి. అదే సమయంలో శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది.

అదే సమయంలో మరో ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. నీరు ఎక్కువగా తాగాలనే కారణంతో ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు. బాడీలోని కిడ్నీలకు నీళ్లను ఫిల్టర్ చేసే పరిమితి ఉంటుంది. రోజుకు 20-28 లీటర్ల నీళ్లనే ఫిల్టర్ చేయగలదు. గంటలో లీటర్ నీళ్లు మాత్రమే ఫిల్టర్ అవుతాయి. అందుకే నీళ్లు ఎప్పుడూ కొద్దికొద్దిగా తీసుకోవల్సి ఉంటుంది.

దాహం వేస్తున్నప్పుడు గానీ, శరీరానికి చెమటలు పడుతున్నప్పుడు గానీ లేదా ప్రతి రెండు గంటలకోసారి కానీ నీళ్లు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. ఇలా చేస్తే బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. రోజుకు మహిళలు 2.7 లీటర్ల నీటిని, పురుషులైతే 3.7 లీటర్ల నీటిని తాగాలని..యూఎస్ నేషనల్ ఎకాడమీ ఆఫ్ సైన్స్ చెబతోంది. అంటే రోజుకు 8 గ్లాసుల నీళ్లు తీసుకోవల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలైతే రోజుకు 3 లీటర్ల నీరు తీసుకోవాలి. వేసవిలో అయితే మహిళలలైనా, పురుషులైనా కాస్త ఎక్కువ నీళ్లు తీసుకున్నా నష్టం లేదు. 

Also read: Muskmelon Health Benefits: ఖర్బూజతో మధుమేహానికి చెక్..సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌తో అద్భుత ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News