Muskmelon Health Benefits: ఖర్బూజతో మధుమేహానికి చెక్..సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌తో అద్భుత ప్రయోజనాలు

Muskmelon benefits: సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా మనకు లభించే అద్భుతమైన పండు..ఖర్బూజ. ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2022, 09:10 PM IST
Muskmelon Health Benefits: ఖర్బూజతో మధుమేహానికి చెక్..సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌తో అద్భుత ప్రయోజనాలు

Muskmelon benefits: సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా మనకు లభించే అద్భుతమైన పండు..ఖర్బూజ. ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

వేసవిలో సాధారణంగా తీసుకునే కొన్నిరకాల పండ్లలో ఒకటి ఖర్బూజ. ఇందులో 95 శాతం నీళ్లుంటాయి. విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. వేసవిలో ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు పలు రకాల వ్యాధుల నియంత్రణలో ఖర్బూజ కీలకపాత్ర పోషిస్తుంది. అవేంటో చూద్దాం.

ఖర్బూజ తింటే..ఛాతీలో మంట తగ్గుతుంది. మూత్రాశయంలోని మలినాలు శుభ్రమౌతాయి. ఇందులో షుగర్, కేలరీలు ఎక్కువ మోతాదులో ఉండనందున..డయాబెటిస్ రోగులకు కూడా మంచిది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు ఆకలిగా ఉన్నప్పుడు ఖర్బూజ తినడం ప్రయోజనకరం. గుండె సంబంధిత వ్యాధులే కాకుండా కేన్సర్ వ్యాధిని నియంత్రణలో కూడా ఖర్బూజ దోహదపడుతుంది. కార్బోహైడ్రేట్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాదు ఖర్బూజలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువున్నవాళ్లు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్..కొద్దిగా తినగానే కడుపు నిండిన అనుభూతి కల్పిస్తుంది. అతి ఆకలిని నివారిస్తుంది. 

డయాబెటిస్ నియంత్రణలో ఖర్బూజ కీలకంగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది కేన్సర్ నివారణలో అవసరమైన రక్షణను అందిస్తుంది. విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కేన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఫలితంగా శరీర కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.

అన్నింటికంటే ముఖ్యంగా ఖర్బూజ క్రమం తప్పకుండా తింటే..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మరోవైపు ఖర్బూజ పండ్లలో అధికమొత్తంలో ఉండే విటమిన్ ఎ, సిలు కంటికి అవసరమైన పోషకాల్ని అందిస్తాయి. కంటిపాపను బలోపేతం చేస్తాయి. ఇందులో అధికమోతాదులో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఖర్బూజలో ఉండే అడినోసిన్ అనే పోషకపదార్ధం ఇందుకు ఉపయోగపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా ఖర్బూజ తీసుకుంటే..ఆ సమస్య పోతుంది. ఇందులో ఉండే నీరు, ఫైబర్ ఇందుకు ఉపయోగపడతాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. 

Also read: Red Marks on Skin: అరచేతిలో ఎర్రటి మచ్చలు ఉంటే ఆ భయంకరమైన వ్యాధికి సంకేతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News