IPL 2022: ఐపీఎల్ 2022 జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ ఇద్దరూ సోదరులు. ఆపోజిట్ టీమ్స్‌లో ఆడుతున్నారు. ఒకరు మరొకర్ని అవుట్ చేశారు. ఇంకొకరు గెలిచారు. అదేంటో మనమూ చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ప్రారంభమై రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్‌లో ఈసారి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్..లక్నో సూపర్ జెయింట్స్ మధ్యనే తొలి మ్యాచ్ జరగడం విశేషం. లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్‌లో ఓ కుటుంబానికి సంబంధించి ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే సమయంలో అతని సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. నిన్న ఈ రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను స్వయంగా అతని సోదరుడు కృనాల్ పాండ్యా అవుట్ చేశాడు. మ్యాచ్ గెలిచింది మాత్రం హార్దిక్ పాండ్యా. సో అతని కుటుంబం పూర్తిగా హ్యాపీ అట. ఈ విషయాన్ని స్వయంగా హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. మరోవైపు తన టీమ్ సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. మొహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో జట్టుకు శుభారంభాన్ని అందిస్తే.తెవాటియా, మనోహర్‌లు అద్భుతంగా రాణించారని కీర్తించాడు.
Also read: GT vs LSG: ఐపీఎల్ 2022లో గ్రాండ్ విక్టరీతో గుజరాత్ ఎంట్రీ అదిరింది కదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి