కంటోన్మెంట్ వాసులకు గుడ్ న్యూస్... కేటీఆర్ చొరవతో రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు...

తాజాగా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో కేటీఆర్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత, ఇతరత్రా సమస్యలపై చర్చించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 08:07 PM IST
  • ఆర్మీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ
  • కంటోన్మెంట్ సమస్యలపై చర్చించిన మంత్రి
  • రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారంపై చర్చ
కంటోన్మెంట్ వాసులకు గుడ్ న్యూస్... కేటీఆర్ చొరవతో రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు...

KTR meeting with Army Officials: కంటోన్మెంట్ అంటేనే అడుగడుగునా ఆంక్షలు... అభివృద్దికి ఆమడ దూరం అని అక్కడి ప్రజలు వాపోతుంటారు. కంటోన్మెంట్ బోర్డు వార్షిక బడ్జెట్ ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు, అవసరాలకు ఆ బడ్జెట్ ఏ మూలకు సరిపోదన్న విమర్శ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ అభివృద్ది పని మొదలుపెట్టాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో చాలా కాలంగా కంటోన్మెంట్ విలీనానికి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో కేటీఆర్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేత, ఇతరత్రా సమస్యలపై చర్చించారు. ఇక్కడ తరచూ రోడ్లను మూసివేస్తుండటంతో మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులతో పేర్కొన్నారు. అలాగే మెహదీపట్నం కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని వరద కాల్వ సమస్యపై చర్చించారు. 

ఇక కంటోన్మెంట్ మీదుగా స్కై వేల నిర్మాణానికి అనుమతులు కోరుతూ గతంలో పలుమార్లు కేంద్ర రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినట్లు కేటీఆర్ ఆర్మీ అధికారులకు గుర్తుచేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. తాజా భేటీలో కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపై ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని దక్షిణ భారత లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ తెలిపారు. 

కంటోన్మెంట్‌లో ప్రధాన సమస్యగా ఉన్న రోడ్ల మూసివేతకు సంబంధించి త్వరలోనే ఆర్మీ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఒక ఉమ్మడి ఇన్‌స్పెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  అలాగే మెహాదీపట్నం ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో బల్కాపూర్ వరద నాల విస్తరణకు ఆర్మీ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మెహదీపట్నం చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు. గోల్కొండ గోల్ఫ్ కోర్స్, డాలర్ హిల్స్ మీదుగా నెక్‌నామ్ పూర్ వైపు వెళ్లే లింకు రోడ్ల నిర్మాణానికి  సైతం సహకరిస్తామని తెలిపారు. 

Also Read: Srilanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం ప్రపంచానికి ఏం పాఠం చెబుతోంది...

Petrol price: సామాన్యులపై పెట్రో పిడుగు.. 2014తో పోలిస్తే ధరలు ఎంత పెరిగాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News