Cardless withdrawal: ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసకుంది. అందులో ముఖ్యమైంది ఏటీఎంలలో కార్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్. ఇంతకీ ఏమిటి ఈ కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్స్? ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఏం జరగనుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఏటీఎం, డెబిట్ కార్డు తప్పనిసరి. అయితే కొన్నాళ్ల నుంచి కార్డు లేకున్నా ఏటీఎంల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతినిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అయితే అన్ని బ్యాంకుల వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోలేకకపోతున్నారు. దీనితో ఆర్బీఐ.. బ్యాంకు కస్టమర్లందరికీ కార్డ్‌లెస్ విత్‌డ్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజా ఎంపీసీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో అన్ని బ్యాంకుల వినియోగదారులు త్వరలో ఏటీఎం/డెబిట్ కార్డులు లేకున్నా ఏటీఎంలు, బ్యాంకుల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకు యూపీఐ (యూనైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్)లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండటం తప్పనిసరి. ఈ సదుపాయంపై త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు వెల్లడించనుంది ఆర్బీఐ.
మరిన్ని..
దేశంలో విదేశీ మారక నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 1 నాటికి దేశంలో 606.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
కొవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని ఆర్బీఐ వెల్లడించింది. అయితే కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కుతున్నమని సంతోషించేలోపే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మళ్లీ ప్రతికూలతలు మొదలయ్యాయని వివరించింది.
Also read: OnePlus new TV: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌టీవీ- ధర, ఫీచర్ల ఇవే..
Also read: RBI MPC meet: కీలక వడ్డీ రేట్లు యథాతథం- ఇకపై అన్ని ఏటీఎంలలో కార్డ్‌లెస్ విత్‌డ్రా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook