Tricky Question: ఈ చిత్రంలో ఉన్న గ్లాసుల్లో ఏది త్వరగా నీటితో నిండిపోతుంది?

Tricky Question: కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి కొన్ని పజిల్స్ పూర్తి చేసేప్పుడే అర్థం అవుతుంది. అలాంటి ఓ ట్రిక్కీ పజిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దానికి సరైన సమాధానం ఏంటో మీరే కనుగొనండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 04:59 PM IST
Tricky Question: ఈ చిత్రంలో ఉన్న గ్లాసుల్లో ఏది త్వరగా నీటితో నిండిపోతుంది?

Tricky Question: సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని గమ్మత్తన చిత్రాలు వైరల్ గా మారుతున్నాయి. ఆ ట్రీక్కీ పజిల్స్ కు కొంతమంది సమాధానాలు చెప్పుతుంటే మరికొందరు మాత్రం ఆలోచిస్తూనే ఉంటున్నారు. గంటల తరబడి దాని కోసం ఆలోచించినా.. సరైన సమాధానం ఒక్కరికి దొరకడం లేదు. అయితే ఆ ట్రిక్కీ పజిల్ ఏంటో మీరూ చూసేయండి. సరైన సమాధానం చెప్పేసేయండి. 

వైరల్ గా మారిన చిత్రంలో ఓ ట్యాప్ కింద 7 గాజు గ్లాసులను ఉంచారు. వాటన్నింటిని ఓ పైపుతో జత చేశారు. కొన్ని ఎత్తైన ప్రదేశంలో ఉండగా.. మరికొన్ని అట్టడుగున ఉన్నాయి. అయితే ట్యాప్ కింద ఉన్న 7 గ్లాసుల్లో ఏది మొదటిగా నిండిపోతుందని ప్రశ్నను లేవనెత్తారు. దానికి సరైన సమాధానం ఏంటో మీరైనా కనుగొంటారా? 

సమాధానం దొరికేసింది!

పైన ఉన్న చిత్రాన్ని సరిగా గమనిస్తే.. ట్యాప్ కింద 1వ నంబరు గ్లాస్ ఉంది. దానికి రెండు వైపులా రెండు పైపులు.. వాటి కింద మరో రెండు అంటే 2, 3వ గాజు గ్లాసులు ఉన్నాయి. ఆ తర్వాత వాటి కింద మరో రెండు రెండు గాజు గ్లాసులు ఉన్నాయి. 3వ నంబరు గ్లాస్ కింద 4, 5 గ్లాసులు ఉండగా.. 2వ దాని కింద 6, 7 గ్లాసులు ఉన్నాయి. 

అయితే వీటిలో తొలుత 1వ గ్లాస్ లో పడిన వాటర్ 2, 3కు చేరుకుంటాయి. ఆ తర్వాత 3వ గ్లాసు లోని నీరంతా ఎటూ వెళ్లదు. ఎందుకంటే ఆ గ్లాస్ కు సంబంధించిన రెండు ద్వారాలు మూసేసి ఉన్నాయి. దీంతో మొదటగా 3వ గ్లాస్ పూర్తిగా నీటితో నిండిపోతుంది.   

Also Read: Viral Video: వధువు కోపానికి బోరున ఏడ్చేసిన వరుడు- ఏం జరిగిందంటే?

Also Read: Shocking Video: రైలు ఎదురుగా దూసుకుంటూ వచ్చినా.. ఆమెకు సెల్ ఫోనే ముఖ్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News