బాల్ ట్యాంపరింగ్‌పై చర్యలు సబబే: సచిన్

స్టీవ్ స్మిత్, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ లపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన చర్యలు తీసుకుందని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు.

Last Updated : Mar 29, 2018, 09:32 AM IST
బాల్ ట్యాంపరింగ్‌పై చర్యలు సబబే: సచిన్

స్టీవ్ స్మిత్, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ లపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన చర్యలు తీసుకుందని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. 'జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్‌లో జరిగిన పరిణామాలు దురదృష్టకరం. కానీ ఆటను కాపాడేలా సీఏ సరైన చర్యను తీసుకుంది. గెలవడమే కాదు ఎలా గెలిచామనేది ముఖ్యమే' అని సచిన్ ట్వీట్ చేశారు. కాగా 2001లో సౌతాఫ్రికా సిరీస్‌లోనూ టాంపరింగ్ జరిగిందని ఆరోపించారు.

 

సీఏ నిషేధం

కేప్ టౌన్‌ టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి, ఆ నేరాన్ని అంగీకరించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లని ఏడాదిపాటు క్రికెట్ నుంచి నిషేధిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న ఆసిస్ బ్యాట్స్‌మన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలపాటు నిషేధం విధిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

ఐపీఎల్ శిక్ష

బాల్ ట్యాంపరింగ్ కేసులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న మరుక్షణమే బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను ఐపీఎల్ 2018కి దూరం పెడుతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. దీంతో రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు పాల్గొనే అవకాశం లేదని, ఆ ఇద్దరి స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవాల్సిందిగా ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలకు కోరారు.

Trending News