Delhi Commuters Straits: కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రో ధరలు పెంచుకుంటూ పోతోంది. ధరల నియంత్రణను చమురు సంస్థలకు అప్పగించడంతో పెట్రో ధరలకు అడ్డు అదుపు ఉండడం లేదు. పెట్రో ధరల పెరుగుదలతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చులకు సరిపడ ఆదాయం పెరగకపోవడంతో చాలా నష్టపోతున్నారు. దీంతో పెట్రోలు, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో సమ్మె బాటపట్టారు. దీంతో ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, మినీబస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో రైల్వే స్టేషన్లకు, బస్టాండ్ లకు చేరుకోలేకపోతున్నారు. దీంతో తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో ట్యాక్సీ యూనియన్లు సమ్మెకు పిలుపును ఇచ్చి వాహనాలను నిలిపివేయడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలకు చేరుకోవాల్సిన ప్రయాణీకులతో పాటు..... పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు చేరుకోవడానికి విద్యార్థులు, ఉద్యోగులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది.
పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ఢిల్లీ ఆటో అండ్ టాక్సీ అసోసియేషన్ ఏప్రిల్ 18, 19 తేదీలలో ఢిల్లీలో సమ్మెను ప్రకటించింది. పెరిగిన పెట్రో ధరలకు సమానంగా ఛార్జీలు కూడా పెంచాలనే డిమాండ్‌తో పాటు మరో 16 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. సమ్మెపై స్పందించిన కేజ్రీవాల్ సర్కారు సకాలంలో ఛార్జీల సవరణను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా ఆటో, టాక్సీ అసోసియేషన్ సమ్మె విరమించడం లేదు. సీఎన్జీ ధరలపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కిలోకు రూ.35 సబ్సిడీ ఇవ్వాలని ఆటో, ట్యాక్సీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
నష్టాల నుంచి తమను తాము తప్పించుకోడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందులకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వాలు స్పందించకపోతే భవిష్యత్తులో కూడా సమ్మె చేపడతామని హెచ్చరించాయి.
Also Read: Kadapa RIMS: ప్రిన్సిపాల్ ఛాంబర్‌కు సీల్.. కడప రిమ్స్ లో ఫైటింగ్..!
Also Read: Fourth Wave Scare: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఆ నగరాల్లో మాస్క్ ధారణ ఇక తప్పనిసరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.