Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం.. నగర వాసులకు ఉపశమనం!

Rain lashes Hyderabad. హైదరాబాద్ మహా నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల తేలిక పాటి వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్‌లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 06:38 PM IST
  • హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం
  • హైదరాబాద్‌లో తేలిక పాటి వర్షం
  • ఉపశమనం పొందుతున్న నగర వాసులు
Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం.. నగర వాసులకు ఉపశమనం!

Rain with gusts of wind in Hyderabad, Peoples enjoy Cool weather: హైదరాబాద్ మహా నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్‌లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డుతోంది. నగరమంతటా ఉరుములు ఉరుముతుండగా.. మెరుపులు మెరుస్తున్నాయి. ఈ అకాల వర్షానికి న‌గ‌రం అంతటా చ‌ల్ల‌బ‌డింది. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంప‌ల్లి, కోఠి, ల‌క్డీకాపూల్, అత్తాపూర్, సోమాజిగూడ‌, బేగంపేట‌, ఇబ్ర‌హీంప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, హ‌య‌త్‌న‌గ‌ర్ బీఎన్ రెడ్డితో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. కొన్ని చోట్ల రోడ్లపై నీరు పరుగులు పెడుతోంది. వర్షంతో భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు ఉపశమనం పొందుతున్నారు. 

కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ పూర్తికాకముందే రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో విపరీతమైన ఎండ కాచింది. దాంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకి రావడానికి కాస్త ఆలోచించారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలో వాతావరణం కాస్త చల్లబడింది. సాయంత్రానికి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

మలక్ పేట తీగల గూడలో ఈదురు గాలులతో చెట్టు కూలి పార్క్ చేసిన బైక్‌పై పడింది. దాంతో ఆ బైక్‌ కాస్త ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న డిఆర్‌ఎఫ్ బృందం అక్కడికి చేరుకొని చెట్టుని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పాతబస్తీలో పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు.

Also Read: PK Joining Congress: కాంగ్రెస్‌ గూటికి ప్రశాంత్‌ కిషోర్‌.. నాలుగైదురోజుల్లో ముహుర్తం ఫిక్స్‌..!!

Also Read: Mask Fine Hyderabad: తెలంగాణలో మాస్క్ ధరించపోతే రూ.1,000 జరిమానా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News