Jharkhand Crime news: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా ఆడవాళ్లపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మైనర్ బాలురు సైతం ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.
జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖుంటి జిల్లాలో (Khunti district) మంగళవారం రాత్రి జరిగింది. ఈ బాలుర వయసు 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ''బాలిక పెళ్లికి హాజరయ్యేందుకు పక్క గ్రామానికి వెళ్లింది. ఓ డ్యాన్స్ ప్రోగ్రాం సందర్భంగా తనకు ముందు నుంచి తెలిసిన అబ్బాయిలతో వాగ్వాదానికి దిగింది. అర్ధరాత్రి సమయంలో ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా, వారిని వెంబడించారు ఆ బాలురు. ఆమెను ఆపి, ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. సంఘటన స్థలం నుండి తప్పించుకున్న బాలిక ఇద్దరు స్నేహితులు.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే, తల్లిదండ్రులు ఆమె కోసం వెతుకుతూ రావడంతో..వారిని చూసిఆ కుర్రాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు'' అని పోలీసులు తెలిపారు.
Also Read: Navneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్‌కు వీఐపీ భద్రత..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.